amp pages | Sakshi

చాలా సార్లు కాల్‌ చేశా.. పట్టించుకోలేదు: విశ్వక్‌సేన్‌పై అర్జున్‌ ఫైర్‌

Published on Sat, 11/05/2022 - 17:01

యంగ్‌ హీరో విశ్వక్‌సేన్‌పై సీనియర్‌ హీరో అర్జున్‌ ఫైర్‌ అయ్యాడు. అర్జున్‌  దర్శకత్వంలో  విశ్వక్‌ సేన్‌ ఓ సినిమా కమిట్‌ అయిన విషయం తెలిసిందే. అందులో అర్జున్‌ కూతురు ఐశ్వర్య అర్జున్‌ హీరోయిన్‌. ఈ సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. చివరి నిమిషంలో ఆ ప్రాజెక్ట్ నుంచి విశ్వక్‌ తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా అర్జున్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి విశ్వక్‌ సేన్‌పై ఫైర్‌ అయ్యాడు.

‘నేను చెప్పిన కథ విశ్వక్‌సేన్‌కి బాగా నచ్చిందని చెప్పాడు. రెమ్యునరేషన్‌ విషయంలోనూ అతను చెప్పిన విధంగానే అగ్రిమెంట్‌ జరిగింది.కానీ కొన్ని వెబ్‌సైట్స్‌లో మా సినిమా నుంచి విశ్వక్‌ సేన్‌ తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అవి ఎందుకు వచ్చాయో తెలియదు. నా లైఫ్‌లో విశ్వక్‌ సేన్‌కి చేసినన్ని కాల్స్‌ ఎవరికి చేయలేదు. ప్రతిసారి షూటింగ్‌ వస్తానని చెప్పి డుమ్మా కొడతాడు. కేరళలో షూట్‌ మొదలు పెట్టినప్పుడు అతని మేనేజర్‌ వచ్చి టైమ్‌ కావాలి అన్నాడు. నేను కూడా ఆర్టిస్ట్‌నే కదా.. అర్థం చేసుకొని ఓకే చెప్పి ఆ షేడ్యూల్‌ని కాన్సిల్‌ చేసుకున్నాం. దాని వల్ల జగపతి బాబు లాంటి పెద్ద నటుల డేట్స్‌ కూడా వేస్ట్‌ అయ్యాయి. అయినా పర్లేదు అనుకున్నాను.

ఆ తర్వాత విశ్వక్‌కి నేను చాలా సార్లు కాల్‌ చేశాను.. అతను పట్టించుకోలేదు. ఇటీవల నా దగ్గర వచ్చి మళ్లీ కథ చెప్పమన్నాడు. చెప్పాను సూపర్‌ అని అన్నాడు. దీంతొ ఈ నెల 3న షూట్‌ పెట్టుకున్నాం. రాత్రి 2 గంటల వరకు నాతో టచ్‌లో ఉన్నాడు. ఈ రోజు షూట్‌ అనగా.. ఉదయం ‘నేను రావడం లేదు.. నాకు టైమ్‌ కావాలి’అని మెసేజ్‌ చేశాడు. కథ నచ్చింది ప్రొడక్షన్ నచ్చింది అని చెప్పిన విశ్వాక్ సేన్ కి ఇంకా ఏమి నచ్చలేదు?

సీనియర్ హిరోలు ఎంతో కమిట్ మెంట్‌తో ఉంటారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఎంతో డెడికేటెడ్ గా ఉంటారు.. వాళ్లకు  ఏమి తక్కువ? మన వర్క్ కి మనం సిన్సియర్ గా ఉండాలి అని చెపుతున్నాను. ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ ఎంతో పెద్ద స్థాయి లో ఉంది. సినిమా ఇండస్ట్రీలో టీమ్ వర్క్ ప్రధానం. ఇలాంటి వాతావరణంలో విశ్వక్‌తో  నేను సినిమా చేయలేను. ఈ విషయం అందరికీ తెలియాలి అని ప్రెస్ మీట్ పెట్టాను. ఇక్కడ ఒక పద్దతి ఉంటుంది .. అందరూ ఆ పద్ధతిని పాటించాలి. కుదరదు అంటే ఇంట్లో కూర్చోవాలి. 

అనూప్ మ్యూజిక్ , బుర్ర సాయిమాదవ్ డైలాగ్స్ , చంద్రబోస్ పాటల విషయంలో విశ్వక్ నాతో విభేదించారు. విశ్వక్ ప్రవర్తన వల్ల నేను ప్రస్తుతం సినిమా ఆపేశాను. వందకోట్లు వచ్చినా నేను విశ్వక్ తో సినిమా చేయను. త్వరలోనే కొత్త హీరో, టైటిల్ తో సినిమాను ప్రకటిస్తాను. విశ్వక్ ప్రవర్తనను ప్రొడ్యూసర్ గిల్డ్ దృష్టికి తీసుకెళ్తాను’అని అన్నారు. 

Videos

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)