amp pages | Sakshi

రహస్యంగా పెళ్లి చేసుకున్న యాంకర్‌ రష్మీ? అబ్బాయి ఎవరంటే..

Published on Mon, 01/24/2022 - 11:43

Is Anchor Rashmi Gautam Secretly Married, Details Here: యాంకర్‌ రష్మీ గౌతమ్‌.. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ యాంకర్‌గా దూసుకుపోతుంది. తెలుగులో ప్రముఖ కామెడీ షోకు యాంకరింగ్‌ చేస్తున్న రష్మీ సుడిగాలి సుధీర్‌తో లవ్‌ట్రాక్‌తో మరింత ఫేమస్‌ అయ్యింది. బుల్లితెరపై వీరిద్దరి జోడీకి ఎంత మంది అభిమానులున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో అడపాదడపా పాత్రలు చేసినా అవి అంతగా సక్సెస్‌ కాలేదు.

అయితే తాజాగా రష్మీకి సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. గతేడాది లాక్‌డౌన్‌లోనే రష్మీ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది. గతంలో సుడిగాలి సుధీర్‌తో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలను ఆమె ఖండించిన సంగతి తెలిసిందే. తామిద్దరం మంచి ఫ్రెండ్స్‌ అని పలుమార్లు చెప్పుకొచ్చింది. 

తాజా సమాచారం ప్రకారం రష్మీ.. ఇండస్ట్రీతో ఏమాత్రం​ సంబంధం లేని ఓ వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకుందట. అతను ఓ ప్రైవేట్‌ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం భర్తతో కలిసి హైదరాబాద్‌లోనే ఉంటుందట. అయితే ఈ విషయం గురించి బయటకు లీకైతే కెరీర్‌ పరంగా ఇబ్బందులు వస్తాయని భావించి పెళ్లి మ్యాటర్‌ను దాచేసిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విషయంపై రష్మీ త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. గతంలో యాంకర్‌ రవి సైతం పెళ్లయిన విషయాన్ని దాచి పెట్టిన సంగతి తెలిసిందే. ఇక రష్మీ పెళ్లి వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఫ్యాన్స్‌ మరిప్పుడు సుధీర్‌ పరిస్థితేంటి అంటూ పోస్టులు పెడుతున్నారు.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)