amp pages | Sakshi

తన భర్తనే మళ్లీ పెళ్లి చేసుకున్న స్టార్‌ హీరోయిన్‌..

Published on Wed, 03/16/2022 - 08:03

Amrita Rao And RJ Anmol Reveals Their Wedding Photos: బాలీవుడ్ బ్యూటీ అమృత రావు సూపర్ స్టార్‌ మహేశ్‌ బాబు సరసన అతిథి సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ చిత్రంలో తన గ్లామర్‌, అభినయంతో బాగానే ఆకట్టుకుంది. కానీ తర్వాత మళ్లీ తెలుగు తెరపై ఆమె కనిపించలేదు. తిరిగి బాలీవుడ్‌కే వెళ్లిన అమృత మంచి స్టార్‌ హీరోయిన్‌గా పాపులారిటీ సంపాందించుకుంది. తాజాగా అమృత తన పెళ్లి ఫొటోలను మొట్టమొదటిసారిగా షేర్‌ చేసింది. అది ఎలా అంటే తన భర్తను తానే మళ్లీ పెళ్లి చేసుకుని. అవును.. అమృతకు ఆర్జే అన్మోల్‌తో 2014లో రహస్య వివాహం జరిగింది. అయితే ఇదివరకూ ఆర్జే అన్మోల్‌తో తనకు రహస్య వివాహం జరిగినట్టు ఓ వీడియో ద్వారా ప్రకటించింది. ఇప్పుడు తాజాగా ఆర్జే అన్మోల్‌ను మళ్లీ చేసుకుంటూ తమ పెళ్లి నాటి ఫొటోలను ఒక వీడియో రూపంలో బయట పెట్టింది ఈ బ్యూటీ. 

ఈ సెలబ్రిటీ జంట యూట్యూబ్‌ ఛానల్‌ 'కపుల్‌ ఆఫ్‌ థింగ్స్‌'లోని కొత్త ఎపిసోడ్‌లో తమ వివాహ వివరాలను పంచుకున్నారు. పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత తమ కుటుంబ సభ్యుల మధ్య ఈ జంట మళ్లీ పెళ్లి చేసుకుంది. ఈ వీడియోలో అమృత, అన్మోల్‌ తమ కుటుంబ సభ్యులతో కలిసి సంభాషించడం, మెమొరీ లేన్‌లో నడవడం వంటి తదితర మధురమైన క్షణాలను పంచుకుంది ఈ జంట. కాగా ఈ సెలబ్రిటీ జంట తమ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపకుండా ఉండేందుకే రహస్యంగా 2014లో మే 15న వివాహం చేసుకున్నట్లు తెలిపింది. ఈ బ్యూటీఫుల్‌ సెలబ్రిటీ కపుల్‌కు నవంబర్‌ 1, 2020న బాబు పుట్టాడు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌