amp pages | Sakshi

ఆ స్టార్‌ డైరెక్టర్‌ జీవితంలో చిచ్చు పెట్టిన అమలాపాల్‌!

Published on Wed, 01/12/2022 - 20:41

సినిమాల్లో అమాయకపు ఎక్స్‌ప్రెషన్స్‌, వినయంతో కనిపించే హీరోయిన్‌ అమలాపాల్‌ బయటక మాత్రం సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకొవచ్చు. తరచూ వివాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆమె వార్తల్లో నిలుస్తోంది. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా సౌత్‌లో వెలుగు వెలిగిన ఆమె కెరీర్‌ ఒక్కసారిగా స్లో అయ్యింది. ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే స్టార్‌ హీరోల సరసన నటించే ఆఫర్స్‌ అందుకున్న ఆమె కెరీర్‌ గ్రాఫ్‌ అంతే తొందరగా పడిపోయింది.

దీనికి ఆమె తీరు ఒక కారణమనే చెప్పొచ్చు. ఈ క్రమంలో కెరీర్‌ మళ్లీ స్టార్ట్‌ చేసిన ఈ డస్క్రీ బ్యూటీ ఆడపాదడపా సినిమాలు చేస్తూ కెరీర్‌ను నెట్టికొస్తుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌ల్లో కూడా నటిస్తూ బిజీగా మారింది. ఇప్పటికే అమల తెలుగులో ‘కుడిఎడమైతే’ అనే వెబ్ సీరిస్ చేసిన సంగతి తెలిసిందే. దీనితో పాటు ఆమె హందీలో ‘రంజిష్‌ హీ సహీ’ అనే వెబ్‌ సిరీస్‌ కూడా చేసింది. ఇప్పుడు అది జనవరి 13 నుంచి ప్రముఖ ఓటీటీలో వూట్‌(Voot)లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇదిలా ఉంటే ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇందులో అమలాపాల్‌ మద్యానికి, ధూమపానానికి బానిసైన స్టార్‌ నటిగా కనిపించనుంది. స్టార్‌ డైరెక్టర్‌-నిర్మాత మహేశ్‌ భట్‌ నిజజీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్‌లో నటి పర్విన్‌ బాబీ పాత్రలో అమల ఒదిగిపోయిందని, చాలా బాగా నటించిందంటూ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. దీంతో ఇప్పుడు ఈ ట్రైలర్‌ యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. పుష్పదీప్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌ను నిర్మాత మహేశ్ భట్ నిర్మించాడు. ఇందులో కథానాయకుడు శంకర్ పాత్రను ’83’ మూవీలో సునీల్ గవాస్కర్‌గా నటించిన తాహిర్ రాజ్ బసీన్ పోషిస్తున్నాడు.

ఈ వెబ్ సీరిస్ స్టోరీ యాభై శాతం మహేశ్ భట్ జీవితమే అని, కొన్ని ఫిక్షన్ అని తాహిర్‌ ఇటీవల ఓ ఇంటర్య్వూలో వెల్లడించాడు. ఇందులో అతడు మహేశ్‌ భట్‌ పాత్రలో దర్శకనిర్మాతగా నటించాడు. భార్య పట్ల అత్యంత విధేయుడిగా ఉండే ఆ దర్శకుడి జీవితంలోకి ఓ పాపులర్ నటి, సింగర్ పర్విన్‌ అడుగుపెట్టడంతో ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఈ వెబ్ సీరిస్ కథ. ఇందులో అమలాపాల్‌ దర్శకుడి వైవాహిక జీవితంలో చిచ్చపెట్టే సదరు స్టార్‌గా కనిపించనుంది. ఈ పాత్ర కోసం ఆమె మద్యం తీసుకోవడం, సిగరెట్ తాగడం, లిప్‌లాక్‌ చేయడం వంటి సన్నివేశాలను ఈ ట్రైలర్‌లో చూపించారు. ఇలా అమలా పాల్‌ చూసిన నెటిజన్లు ప్రస్తుతం ఆమె పరిస్థితికి అన్వయించుకుని తమదైన శైలిలో కామెంట్స్‌ చేస్తున్నారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)