amp pages | Sakshi

‘గీత ఆర్ట్స్‌’ బ్యానర్‌లో గీత ఎవరో చెప్పేసిన అల్లు అరవింద్‌

Published on Tue, 10/18/2022 - 18:44

తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థలో గీత ఆర్ట్స్‌ బ్యానర్‌ ఒకటి. ఈ బ్యానర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. చెప్పాలంటే ఈ నిర్మాణ సంస్థకు పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ బ్యానర్లో సినిమా అంటే ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగిపోతాయి. కొత్త నటినటులు ఉన్నప్పటికి ఈ బ్యానర్‌లో వచ్చే సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువనే చెప్పాలి. అయితే ఏ నిర్మాణ సంస్థకు అయిన వారివారి కూతుళ్ల పేర్లులేదా భార్య పేరు, ఇంటి పేరు ఉంటుంది. కానీ, అల్లు అరవింద్‌ నిర్మాణ సంస్థ ‘గీత ఆర్ట్స్‌’లో గీత అనేది ఎవరు పేరు అనేది ఆసక్తి కలిగించే విషయం. ఎందుకంటే ఈ పేరుతో అల్లు కుటుంబంలో ఎవరు లేకపోవడమే! 

చదవండి: బిగ్‌బాస్‌ 6: గీతూ రాయల్‌ భర్త ఎవరు, ఏం చేస్తుంటాడో తెలుసా?

తాజాగా గీత ఆర్ట్స్‌లో గీత అంటే ఎవరో రివీల్‌ చేశారు సంస్థ అధినేత అల్లు అరవింద్‌. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న ఆయనకు గీత ఆర్ట్స్‌లో.. గీత అంటే ఎవరనే ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘గీత’ అనేది నా గర్ల్ ఫ్రెండ్ అనే డౌటు చాలామందిలో ఉంది. అది నిజమే. నాకు గీత అనే గర్ల్‌ఫ్రెండ్‌ ఉండేది. ఆమె పేరునే మా నిర్మాణ సంస్థకు పెట్టానని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ అందులో నిజం లేదు. నా గర్ల్‌ఫ్రెండ్‌ పేరు గీత అనేది నిజం, మా బ్యానర్‌ పేరు గీత ఆర్ట్స్‌ అని పెట్టడం నిజం. కానీ ఈ రెండూ వేరు వేరు సందర్భాలు. అయితే నా స్నేహితులు ఈ రెండింటిని కలిపేసి నన్ను ఆటపట్టిస్తుంటారు‘’ అని ఆయన చెప్పుకొచ్చారు. అనంతరం తమ బ్యానర్‌కు గీత ఆర్ట్స్‌ పెట్టడం వెనక అసలు కారణమేంటో ఆయన వివరించారు.

చదవండి: పూరీకి ఆ విషయం తెలియకుండా మేనేజ్‌ చేశా: సత్యదేవ్‌

‘‘నిజానికి ‘గీత ఆర్ట్స్’ అనే పేరుతో సొంత నిర్మాణ సంస్థను పెడదామనే ఒక ప్రపోజల్‌ను  పెట్టింది మా నాన్నగారు (అల్లు రామలింగయ్య).  భగవద్గీత బోధన ప్రకారం.. ప్రయత్నం మాత్రమే మనది .. ఫలితం మన చేతిలో లేదు అనేది సారాంశం. అది సినిమాలకు కరెక్టుగా సరిపోతుంది. నిర్మాతగా నీ ప్రయత్నం నువ్వు చేయడమే.. ఫలితం ప్రేక్షక దేవుళ్ల చేతిలో ఉంటుంది. ‘గీత’లో చెప్పినట్లుగా సినిమా నిర్మాణ వ్యవహారాలు ఉండటంతో ‘గీత ఆర్ట్స్’ అని పెడదామని నాన్నగారు అనడం..  అదే ఫైనల్ కావడం జరిగిపోయింది’’ అని అల్లు అరవింద్‌ తెలిపారు. మరి పెళ్లి తర్వాత అయినా ఈ పేరు నిర్మల ఆర్ట్స్‌ అని మార్చొచ్చు కదా అని హోస్ట్‌ అడగడంతో అప్పటికే ఈ బ్యానర్ నుంచి ఎన్నో సూపర్ హిట్లు వచ్చాయని, అందుకే మార్చడం ఎందుకని వదిలేశామని నవ్వుతూ సమాధానం ఇచ్చారు అల్లు అరవింద్.

Videos

ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు

రికార్డు బ్రేక్ అయ్యేలా ఈసారి ఎన్నికల ఫలితాలు

గవర్నర్ కు ఫిర్యాదు..ప్రధాన ముద్దాయి చంద్రబాబు

ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారుల షాక్

కాంగ్రెస్ లో టెన్షన్: పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుపై గాంధీ భవన్ లో చర్చ

బాబుది మేకపోతు గంభీర్యం..YSRCPదే విజయం..

ఈసీ సీరియస్..కలెక్టర్, ఎస్పీలపై సస్పెన్షన్ వేటు

పేదలకు పండగ..డీబీటీ నిధుల విడుదల

పరారీలో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత రెడ్డి..

దీపక్ మిశ్రా పై మోపిదేవి ఫైర్

Photos

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)