amp pages | Sakshi

అలియా బర్త్‌డే సర్‌ప్రైజ్‌, బ్రహ్మస్త్ర నుంచి ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది

Published on Tue, 03/15/2022 - 13:00

Alia Bhatt First Look Released From Brahmastra: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అలియా భట్‌, ఆమె ప్రియుడు రణ్‌బీర్‌ కపూర్‌ తొలిసారి జంటగా నటించిన చిత్రం ‘బ్రహ్మస్త్ర’. బాలీవుడ్‌ డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ అంత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కించాడు. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే నేడు అలియా బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. మార్చి 15న అలియా 29వ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌ అయాన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అలియా ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేస్తూ సర్‌ప్రైజింగ్‌ వీడియో షేర్‌ చేశాడు. కాగా ఇందులో అలియా పాత్ర పేరు ఇషా.

ఈ సందర్భంగా ‘హ్యాపీ బర్త్‌డే మై లిటిల్‌ వన్‌. ఈ ప్రత్యేకమైన రోజున మా బ్రహ్మస్త్ర శక్తి.. ఇషా స్పెషల్‌ వీడియోను రిలీజ్‌ చేస్తున్నాం’ అంటూ రాసుకొచ్చాడు. కాగా ఈ చిత్రంలో రణ్‌బీర్‌ సూపర్‌ హీరో తరహా పాత్రతో సందడి చేయనున్నారని తెలుస్తోంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మొదటి భాగం ‘బ్రహ్మాస్త్ర: శివ’ వచ్చే ఏడాది సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుందని ఇటీవల చిత్ర బృందం మోషన్‌ పోస్టర్‌ ద్వారా తెలిపింది. ఇందులో బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌, టాలీవుడ్‌ ‘మన్మధుడు’ నాగార్జున్‌ అక్కినేని ముఖ్యపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)