amp pages | Sakshi

విషాదం...ఆటోలో నటుడి మృతదేహం

Published on Thu, 03/25/2021 - 15:54

సినిమాలపై మోజులు చాలామంది కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి నగరాలకు వస్తారు. సినిమా అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతారు. చివరకు ఏదోలా సినిమా చాన్స్‌ వచ్చినా.. తర్వాత నిలదొక్కుకోలేక చాలామంది ప్రాణాలు కూడా తీసుకుంటారు. మరికొంత మంది రోడ్ల పక్కన, బస్టాండ్స్‌లో చాయ్‌, కూరగాయాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు.  తెరపై వినోదాన్ని అందించే సినీనటులు.. నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు పడతారు. తాజాగా ఓ తమిళ నటుడు.. సినిమా అవకాశాలు రాక, రోడ్లుపై ఉంటూ.. చివరకు ఆటోలోనే మృతిచెందాడు.  హృదయ విచారకర ఘటన చెన్నైలో చోటు చేసుకుంది.

ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న తమిళ నటుడు  విరుత్చకాకాంత్ బాబు ఆటోలోనే తనువు చాలించాడు. తమిళ హీరో భరత్‌ నటించిన ‘ప్రేమిస్తే’ సినిమాలో విరుత్చకాకాంత్ బాబు ఓ చిన్న పాత్రలో నటించాడు. ఆ సినిమా తర్వాత అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. దానికి తోడు అతని తల్లిదండ్రులు ఇటీవల మృతి చెందారు. దీంతో మానసికంగా కృంగిపోయిన విరుత్చకాకాంత్‌ బాబు.. కొద్ది రోజులుగా చెన్నైలోనే ఉంటున్నాడు. రూమ్‌ కిరాయిలు కట్టేందుకు డబ్బులు లేకపోవడంతో రోడ్ల పక్కన, బస్టాండ్లల్లో ఉంటూ సినిమా అవకాశాల కోసం తిరిగాడు. సినిమా అవకాశాలు లేక, తిండి దొరక్క చివరకు ఇలా ఒక ఆటోలో నిద్రిస్తున్న సమయంలో మృతి చెందాడు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌