amp pages | Sakshi

ఆగని టీచకపర్వం!

Published on Wed, 03/29/2023 - 00:30

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం ఇటిక్యాల మోడల్‌ స్కూల్‌ మాజీ ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ సస్పెండ్‌ అయినా.. తాను ఉత్తముడిని అంటూ నిరూపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌గా ఉన్న శ్రీనివాస్‌ మహిళా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియోలు విడుదలయ్యాయి. తమను పదేపదే వేధిస్తున్న శ్రీనివాస్‌ బండారాన్ని లోకానికి తెలిపేందుకు తోటి ఉద్యోగులే రహస్యంగా వీడియోలు తీశారు. ఈ వీడియోలు ‘సాక్షి’కి చేరడంతో వెంటనే కలెక్టర్‌ యాస్మిన్‌ బాషాకు చేరవేసింది. వీడియోలో శ్రీనివాస్‌ చర్యలు చూసి మండిపడ్డ కలెక్టర్‌ అతన్ని ఈనెల 16వ తేదీన సస్పెండ్‌ చేసిన విషయం విదితమే.

నేడు స్కూల్‌కు విచారణ కమిటీ..!

ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు బుధవారం విచారణ కమిటీ స్కూలుకు రానుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సస్పెండ్‌ అయిన శ్రీనివాస్‌ తాను ఉత్తముడని చెప్పుకునేందుకు ముందే ప్లాన్‌ వేశారు. మహిళా సిబ్బంది వద్దకు వెళ్లి.. శ్రీనివాస్‌ మంచోడు అంటూ స్వచ్ఛందంగా రాసి ఇచ్చినట్లుగా ముందే రాసిన లేఖలు వారికి ఇచ్చి వాటిపై సంతకాలు చేయించేందుకు యత్నించారు. ఈ ఘనకార్యానికి ఓ మహిళా ఉద్యోగి నేతృత్వం వహిస్తున్నట్లు సిబ్బంది వాపోతున్నారు. పర్మినెంట్‌ ఉద్యోగులంతా ఆ లేఖలపై సంతకాలు చేయకుండా సున్నితంగా తిరస్కరించారు. అయినా.. పట్టువదలకుండా తాత్కాలిక సిబ్బందితో అవే లేఖలపై సంతకాలు చేయించుకున్నారని సమాచారం. ఈ లేఖలను బుధవారం స్కూల్‌కు విచారణకు వచ్చే కమిటీకి అందజేసేలా ప్లాన్‌ వేశారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. అదే సమయంలో విచారణ కమిటీతో నిందితుడు శ్రీనివాస్‌ కూడా రానున్నట్లు తెలిసి సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అతను ఎదురుగా ఉంటే విచారణ పారదర్శకంగా ఎలా జరుగుతుందన్న సందేహాలు లేవనెత్తుతున్నారు. మరో ఆసక్తికరమైన అంశమేంటంటే.. శ్రీనివాస్‌ ఉత్తముడు అంటూ లేఖలపై సంతకాలు పెట్టాల్సిందిగా ఓ సర్పంచ్‌, మాజీ ఎంపీటీసీ, మరో నలుగురైదుగురు చోటా లీడర్లు స్కూలు సిబ్బందిపై ఒత్తిడి తీసుకువస్తుండటాన్ని వారంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

సిబ్బంది నుంచి లేఖల కోసం బలవంతం

వీడియోలు విడుదలైనా.. కాపాడేందుకు నేతల ప్రయత్నం

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)