amp pages | Sakshi

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

Published on Tue, 03/28/2023 - 01:48

సీడీపీఓ రమాదేవి

జనగామ: బలవర్ధకమైన ఆహారంతోనే సంపూ ర్ణ ఆరోగ్యం కలుగుతుందని సీడీపీఓ రమాదేవి అన్నారు. పౌష్టికాహార వారోత్సవాల్లో భాగంగా సోమవారం పట్టణంలోని ఏబీవీ హైస్కూల్‌ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించా రు. అనంతరం హెచ్‌ఎం శోభకిరణ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా అనేక ఉపయోగాలు ఉన్నాయన్నారు. అనంతరం విజేతలకు ప్రశంస పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఏసీడీపీఓ విజయలక్ష్మి, సూపర్‌వైజర్‌ పూర్ణిమ, డైరెక్టర్‌ శరత్‌కుమార్‌, పోషణ అభియాన్‌ ప్రతినిధి రాజశేఖర్‌, అంగనవాడీ టీచర్లు జుబేదాబేగం, ఉమారాణి, మేఘమాల, పద్మ, ఉమాదేవి, రాములమ్మ, స్వరూపారాణి, భాగ్యమ్మ, ఏఎన్‌ఎం మంగ పాల్గొన్నారు.

ఇంటర్‌ పరీక్షలకు

134 మంది గైర్హాజరు

జనగామ రూరల్‌: జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్‌ పరీక్షలకు 134 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఓ బైరి శ్రీనివాస్‌ తెలిపారు. జనరల్‌ విభాగంలో 3,463 మందికి 3,412, ఒకేషనల్‌ విభాగంలో 1,156 మందికి 1,073 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు పేర్కొన్నారు. పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల జూనియర్‌ కళాశాలల సెంటర్లను డెక్‌ సభ్యులు ఆంజనేయరాజు, వి.లలిత తదతరులు సందర్శించారు.

బాల సంస్కార్‌

కేంద్రాలను విస్తరిస్తాం..

కొడకండ్ల: బాల సంస్కార్‌ కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తామని గ్లోబల్‌ ఫౌండేషన్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ పుస్కూరి సోమేశ్వర్‌రావు తెలిపారు. సోమవారం మండల పరిధి లక్ష్మక్కపల్లి, రామవరం, మొండ్రాయి గ్రామాల్లోని కేంద్రాలను ఆయన సందర్శించి విద్యార్థులకు స్నాక్స్‌ అందజేశారు. అనంతరం మాట్లాడు తూ.. విద్యార్థులు చదువుతో పాటు వినయ విధేయతలు అలవర్చుకునేలా సంస్కార్‌ కేంద్రాల్లో నేర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇందిరమ్మ కాలనీలో ‘జోడో’ యాత్ర

జనగామ: పట్టణ పరిధి బాణాపురం ఇందిరమ్మకాలనీలో సోమవారం కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లింగాజీ, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు బడికె ఇందిర, ఉడత రవియాదవ్‌, ఓబీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు లోక్కుంట్ల ప్రవీణ్‌, కౌన్సిలర్‌ కళ్యాణి, బండారు శ్రీనివాస్‌, ప్రభాకర్‌, కీసర దిలీప్‌రెడ్డి, మల్లారెడ్డి, కర్రె రాజశేఖర్‌, పట్టురి శ్రీనివాస్‌ ఇంటింటికీ వెళ్లి గతంలో కాంగ్రెస్‌ చేపట్టిన అభివృద్ధిని వివరించారు.

పైలేరియా మందుల

పంపిణీపై సర్వే

లింగాలఘణపురం: మండల పరిధి నెల్లుట్ల గ్రామంలో గతంలో చేపట్టిన పైలేరియా మందుల పంపిణీపై కేఎంసీ నుంచి ఎస్‌పీఎం హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌ డాక్టర్‌ నిర్మలాదేవి ఆధ్వర్యంలో సోమవారం సర్వే నిర్వహించారు. ఆమెతోపాటు డాక్టర్‌ సౌజన్య, బృందం సభ్యులు ఈ విషయమై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీపీ జయశ్రీ, డాక్టర్‌ కరుణాకర్‌రాజు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)