amp pages | Sakshi

సింహాలతో సెల్ఫీ.. అట్లుంటది మనతోని!

Published on Fri, 04/01/2022 - 21:15

సాధారణంగా సాధుజంతువులతో మనకి నచ్చినట్లు ప్రవర్తిస్తుంటాం. కానీ పులి, సింహం, ఏనుగులాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకుంటే వాటికి తిక్కరేగితే అంతే సంగతులు. ఇక ప్రత్యేకంగా సింహం గాండ్రింపు వింటేనే హడలిపోయేవాళ్లు చాలా మందే ఉన్నారు. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా సింహాల‌తోనే సెల్ఫీ దిగడమే కాకుండా వాటితో వీడియోలు కూడా తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వివరాల్లోకి వెళితే.. అతని పేరు హుమైద్ అబ్దుల్లా అల్బుకైష్‌. యూఏఈకి చెందిన పెద్ద వ్యాపార‌వేత్త. దుబాయ్‌లోని అత్యంత ధనవంతులలో హుమైద్ ఒకరు. అతను ఎమిరేట్స్ నేషనల్ ఆయిల్ కంపెనీ (ఈఎన్‌ఓసీ) సీఈఓ. అతను తన లగ్జరీ లైఫ్‌స్టైల్‌, సింహాల పెంపకం, వాటితో వీడియోల ద్వారా సోషల్ మీడియాలో స్టార్‌గా కూడా మారాడు. అంతేకాకుండా అతనికి జంతువుల మీద ఉన్న ప్రేమ కారణంగా అల్బుకైష్ జంగిల్ అనే ఒక ప్రైవేట్ జూని నడుపుతున్నాడు. ఎడారి మధ్యలో ఉండే ఈ జూలో సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, ఇత‌ర జంతువులున్నాయి. వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఒక సింహం చెట్టుపైకి ఎక్క‌గా, మ‌రో రెండు కింద ఉన్నాయి. హుమైద్‌ వాటికి కొంత‌దూరంలోనే సెల్ఫీ తీసుకుని సోషల్‌మీడియాలో షేర్‌ చేశాడు. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)