నిరాశ్రయులైన వేలాది మంది ప్రజలు

Published on Thu, 05/27/2021 - 20:00

కిన్షాసా: కాంగో దేశంలో అగ్నిపర్వతం పేలిన ఘటనలో ఇరవైవేల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆ దేశంలోని గోమాలో అగ్నిపర్వతం పేలడంతో లావా ప్రవహించింది. దీంతో డజన్లకొద్దీ ప్రజలు మరణించినట్లు, 40 మంది వరకు తప్పిపోయినట్లు బుధవారం ఐక్యరాజ్యసమితి  తెలిపింది. అంతేకాకుండా అగ్నిపర్వత విస్ఫోటనాకి వందలాది గృహాలు ధ్వంసమయ్యాయి. వేలాది మంది అక్కడి నుంచి దూరంగా పారిపోయారని తెలిపారు. 

కాగా నైరాగోంగో నుంచి 15 కి.మీ (9 మైళ్ళు) దూరంలో 200 సార్లు భూమి కంపించింది.  అయితే ఇప్పటివరకు భూకంపానికి ఎటువంటి మరణాలు సంభవించలేదని అధికారులు తెలిపారు. కానీ భూమి కంపించడంతో పగుళ్లు ఏర్పడ్డాయని, ఈ పగుళ్లు అక్కడి నివాసితులను భయాందోళనలకు గురిచేస్తున్నాయని తెలిపారు.  కాంగో దేశ అధికారులు పునరావాస సహాయక పనులు చేపట్టారు. అయితే దశాబ్దాలుగా రగులుతున్న ఇరగోంగో అగ్నిపర్వతం బద్దలయ్యే సమయాన్ని అక్కడి యంత్రాంగం అంచానా వేయలేకపోయింది. దీంతో ప్రాణ, ఆస్తి నష్టం భారీగా సంభవించింది.

(చదవండి: ఆకుపచ్చగా మారుతున్న గంగానది.. కారణం ఏంటి?)

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ