amp pages | Sakshi

అతడు 3 అడుగుల ఎత్తు.. ఆమె 5 అడుగులు.. వారికి ఓ చిన్నారి!

Published on Sat, 06/26/2021 - 21:20

సాక్షి, వెబ్‌డెస్క్‌: అతడు నటుడు.. ఆమె టీచర్‌.. స్నేహితుల ద్వారా ఓ పబ్‌లో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది... మొదటి చూపులోనే ఆమె.. అతడిని ఇష్టపడింది.. అతడికి కూడా ఆమెపై ప్రేమ చిగురించింది.. ఇద్దరి మనసులు కలిశాకా ఇంకేం ఉంటుంది.. మూడేళ్ల పాటు ప్రేమలో మునిగితేలాక.. ఓ మంచిరోజు చూసి ఐదేళ్ల కిత్రం పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.. సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు.. వారి ప్రేమకు గుర్తుగా ముద్దులొలికే రెండేళ్ల చిన్నారి ఒలీవియా. ఇందులో విశేషం ఏముంది.. సాధారణంగా లవ్‌స్టోరీలన్నీ ఇంచుమించు ఇలాగే ఉంటాయి కదా అంటారా..!

అసలు విషయం తెలిస్తే మీరు కూడా ఈ జంటను ప్రశంసించక మానరు! యునైటెడ్‌ కింగ్‌డంకు చెందిన జేమ్స్(33)‌, చోలే లస్టడ్‌(27) ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. జేమ్స్‌ ఎత్తు 109.3 సెంటీమీటర్లు(మూడు అడుగుల 7 అంగుళాలు). ఆయన భార్య చోలే.. 166.1 సెం.మీ.(5 అడుగుల నాలుగు అంగుళాలు) ఎత్తు ఉంటారు. ఇద్దరి ఎత్తులో సుమారు 56.8 సెం.మీ. వ్యత్యాసం ఉంది. ఇదే.. వారు గిన్నిస్‌ ప్రపంచ రికార్డు సొంతం చేసుకునేందుకు దోహదం చేసింది. ప్రపంచంలోనే ఎత్తులో అత్యంత తేడా కలిగిన దంపతులుగా ఘనత సాధించేలా చేసింది. 

నిజానికి జేమ్స్‌కు డ్వార్‌ఫిజం డయాస్ట్రొఫిక్‌ డైస్‌ప్లాఏసియా అనే అరుదైన వ్యాధి వల్ల మరుగుజ్జుతనం వచ్చింది. చిన్న చిన్న లోపాలకే ప్రేమించిన వ్యక్తిని కాదనుకుని వెళ్లిపోయే ఈ రోజుల్లో.. జేమ్స్‌ను పెళ్లి చేసుకుని, ఆయనతో జీవితాన్ని పంచుకుంటున్న చోలే నిజంగా చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తారని వీరి ప్రేమకథ తెలిసిన వారు ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలైన ప్రేమ ముందు ఈ రికార్డులు చిన్నబోతాయని అంటున్నారు. ఏదేమైనా గిన్నిస్‌ రికార్డు సాధించినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏంటీ..  ప్రేమ గుడ్డిది అంటారా? కానేకాదు.. ఎదుటి వ్యక్తి మనసుని మనోనేత్రంతో మరింత లోతుగా చూడగలిగే మహోన్నత శక్తి గల పవిత్రమైన భావన.. కాదంటారా?! 
చదవండి: వధువు వాళ్లు మటన్‌ వండలేదని పెళ్లికొడుకు ఎంత పనిచేశాడు..

Videos

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)