amp pages | Sakshi

తీవ్ర ఆహార సంక్షోభం.. ‘నల్లహంస మాంసం ఎంతో రుచి’

Published on Mon, 11/01/2021 - 19:53

సియోల్‌: నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ పాలనలో ఉన్న ఉత్తర కొరియా ప్రస్తతం తీవ్ర ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం కిమ్‌.. ఆహార సంక్షోభం కారణంగా కొన్నేళ్లపాటు తక్కువ తినాల్సిందిగా జనాలను కోరాడు. ఇక ఈ సమస్య నుంచి బయటపడటం కోసం కిమ్‌ ఓ అసాధారణ పరిష్కారాన్ని కనుగొన్నాడు.

అదేంటంటే.. ఆకలితో అలమటిస్తున్న తన దేశ ప్రజలను నల్ల హంసలు తినాల్సిందిగా సూచిస్తున్నాడు. దీని గురించి విపరీతమైన ప్రచారం కూడా మొదలుపెట్టాడు. ఇవి ఎంతో రుచిగా ఉండటమే కాక.. ప్రొటీన్‌ రిచ్‌ ఆహారమని ప్రకటించాడు. నల్ల హంసల సంఖ్యను పెంచడం కోసం భారీ ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించాడు. 
(చదవండి: నార్త్‌ కొరియా దీనస్థితి.. కిమ్‌ సంచలన వ్యాఖ్యలు)

ఇప్పటికే దేశం తూర్పు తీరంలోని క్వాంగ్‌ఫో డక్ ఫామ్‌లో, ఉత్తర కొరియా ప్రావిన్స్‌లోని సౌత్ హమ్‌గ్‌యాంగ్‌లో పాలక పార్టీ వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా  ఉన్నత కార్యదర్శి రి జోంగ్ నామ్ నల్ల హంసల పెంపకం కోసం ఒక కేంద్రాన్ని స్థాపించారు. ఈ కార్యక్రమం ఉత్తర కొరియా జాతీయ మీడియాలో ప్రసారం అయ్యింది. అంతేకాక జనాలను నల్ల హంసలు తినేలా ప్రోత్సాహించేందుకు అనేక కార్యక్రమాలు రూపొందించారు. నల్ల హంస మాంసం రుచిగా ఉండటమే కాక.. ఎన్నో ఔషధాలు కలిగి ఉంటుందని.. ప్రజల జీవితాలను మెరుగుపరుస్తుందని జాతీయా మీడియాలో ప్రకటనలు హోరెత్తిస్తున్నారు. 
(చదవండి: వామ్మో.. కిలో అరటిపండ్లు రూ.3400)

కరోనా మొదలైనప్పుడు విధించిన ఆంక్షలను ఉత్తర కొరియా ఇంకా అమలు చేస్తోంది. సరిహద్దులను మూసి వేసింది. ప్యాంగ్యాంగ్‌ పట్టాణాన్ని 2025 వరకు తిరిగి తెరిచే ప్రసక్తి లేదని ప్రకటించింది. సరిహద్దుల మూసివేత, కఠిన నియమాల కారణంగా ఈ ఆహార సంక్షోభం తలెత్తింది. ఇప్పటికే 25 మిలయన్ల దేశవాసులు ఆకలితో అల్లాడుతున్నారని అంతర్జాతీయ మీడియా వెల్లడించిది. ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ నివేదిక ప్రకారం ఉత్తర కొరియా ఈ ఏడాది 8,60,000 టన్నుల ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. 

చదవండి: ప్లీజ్‌.. 2025 వరకు తక్కువ తినండి: కిమ్‌ జాంగ్‌ ఉన్‌

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)