amp pages | Sakshi

యుద్ధం ముగించండి.. ససేమిరా అంటున్న రష్యా!

Published on Fri, 07/08/2022 - 17:24

ఇండోనేషియాలో జరిగిన జీ20 సదస్సులో యూఎస్‌, పాశ్చాత్య మిత్రదేశాలు యుద్ధానికి ముగింపు పలకమంటూ రష్యా పై ఒత్తిడి తెచ్చాయి. ఐతే రష్యా రాయబారి మాత్రం ససేమిరా తగ్గేదేలే అని తేల్చి చెప్పారు. ఈ మేరకు రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత జరిగిన తొలి జీ20 సమావేశంలో యూఎస్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ఆంటోనీ బ్లింకెన్, రష్యా రాయబారి సెర్గీ లావ్‌రోవ్‌లు సుదీర్ఘ చర్చలు జరిపారు.

ఈ సమావేశానికి కంటే ముందే బ్లింకెన్‌ ఫ్రెంచ్‌, జర్మన్‌ సహచరులు, ఒక సీనియర్‌ బ్రిటీష్‌ అధికారితో కలిసి రష్యా ఉక్రెయిన్‌పై సాగిస్తున్న దురాక్రమణ గురించి చర్చించినట్లు యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ పేర్కొంది.  ఐతే ఈ జీ 20 సమావేశంలో... రష్యా ఉద్దేశ పూర్వకంగానే ఉక్రెయన్ వ్యవసాయాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడిందని, అందువల్లే ప్రపంచ ఆహార భద్రత సమస్య ఏర్పడిందన్నారు.ఈ సమస్యకు చెక్‌పెట్టేలా పరిష్కార మార్గాల కోసం కూడా చర్చించారు. అదీగాక బ్లింకెన్‌ రష్యా రాయబారి లావ్‌రోవ్‌తో చర్చించడానికి దూరంగా ఉండటం వల్లే రష్యా ప్రపంచ ఆహార సంక్షోభాన్ని ప్రేరేపించందంటూ విమర్శలు వెలువెత్తాయి.

అంతేకాదు రష్యా యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్‌ ఎగుమతులను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ యూఎస్‌ సెక్రటరీ బ్లింకెన్‌.. రష్యా రాయబారిని ప్రశ్నించారు. అంతేకాదు ఉక్రెయిన్‌ ఎగుమతులను అనుమతించమని రష్యాని డిమాండ్‌ చేశారు. మధ్యాహ్న సమయానికి జరిగిన జీ20 సెషన్‌లో ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా  ప్రసంగించడంతోనే లావ్‌రోవ్ గైర్హాజరయ్యారని దౌత్య వర్గాలు పేర్కొన్నాయి.  కాగా, మాస్కో రాయబారి లావ్‌రోవ్‌ మాత్రం తాను హజరయ్యానని విలేకరుల సమావేశంలో చెప్పడం విశేషం. ఇదిలా ఉండగా.. జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు జరగాయనే వార్తలు హల్‌చల్‌ చేయడంతో ఆ సమావేశం కాస్త ఉద్విగ్నంగా మారింది.

ఇది చాలా విచారకరమైన క్షణమని అమెరికా కార్యదర్శి బ్లింకెన్‌ పేర్కొన్నారు. ఈ జీ20 సమావేశంలో యుద్ధాన్ని సాధ్యమైనంత మేర త్వరగా ముగించడం, చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించడం పై దృష్టి సారించడం వంటివి మాత్రమే తమ బాధ్యత అని ఇండోనేషియా విదేశాంగ మంత్రి రెట్నో మార్సుడి అన్నారు.

(చదవండి: పైశాచికం.. షింజో అబే మృతిపై చైనాలో సంబురాలు!)

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)