వ్యాక్సీన్ తీసుకోని రోగికి గుండె మార్పిడి శస్త్రచికిత్స నిరాకరించిన వైద్యులు

Published on Thu, 01/27/2022 - 16:03

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మ‌హ‌మ్మారి విల‌య తాండ‌వం చేస్తోంది. రెండు, మూడు నెల‌ల‌కొక‌సారి త‌న రూపంతారం మార్చుకుని ప్ర‌జ‌ల‌పై దాడి చేస్తోంది. ఈ నేప‌థ్యంలో అన్ని ప్ర‌భుత్వాలు వ్యాక్సినేష‌న్‌ను క‌చ్చితం చేశాయి. ఎక్క‌డికి వెళ్లినా... క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటేనే అనుమ‌తులు ఇస్తున్నారు. అయితే ఈ నిబంధన కార‌ణంగా కొన్ని అన‌ర్థాలు కూడా చోటు చేసుకుంటున్నాయి.  గుండె మార్పిడి ఆపరేష‌న్ చేయాల్సిన ఓ వ్యక్తికి కరోనా వ్యాక్సిన్‌ తీసుకోలేదని సుపత్రి వర్గాలు నిరాకరించాయి.  ఈ సంఘ‌ట‌న అమెరికాలోని బోస్ట‌న్‌లో గ‌ల ఓ ఆస్ప‌త్రిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. డీజే ఫెర్గుస‌న్ అనే అమెరికాకు చెందిన ఓ వ్య‌క్తికి గుండె మార్పిడి చికిత్స అత్య‌వ‌స‌రంగా చేయాల్సి ఉంది.  

ఈ నేప‌థ్యంలోనే  డీజే ఫెర్గుస‌న్‌ను బోస్ట‌న్‌లో ఉన్న‌టు వంటి.. బ్రిఘం & ఉమెన్స్ ఆస్ప‌త్రిలో చేర్పించారు. గుండె మార్పిడి చికిత్స కోసం ఆసుపత్రి నిబంధనల ప్ర‌కారం.. అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేశారు. అంత‌లోనే ఆస్ప‌త్రి ట్విస్ట్ ఇచ్చింది. డీజే ఫెర్గుస‌న్.. ఇంత వ‌ర‌కు సింగిల్ డోస్ కూడా వేసుకోలేద‌ని, అత‌ను వ్యాక్సిన్ వేసుకుంటేనే తాము చికిత్స చేస్తామ‌ని ఆస్ప‌త్రి వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో డీజే ఫెర్గుస‌న్‌తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆందోళ‌నకు గుర‌య్యారు.
చదవండి: మనిషి చర్మంపై ఒమిక్రాన్‌ ఎన్ని గంటలు సజీవంగా ఉంటుందో తెలుసా?

అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో ఇలాంటి నిబంధనలు ఎంట‌ని నిలదీశారు. తాను అస్సలు వ్యాక్సిన్ వేసుకోబోన‌ని  అటు డీజే ఫెర్గుస‌న్ మొండి ప‌ట్టు ప‌ట్టారు. ఇంకేముంది.. తాము ఆప‌రేష‌న్ చేయ‌లేమ‌ని ఆస్ప‌త్రి సిబ్బంది కుండ బ‌ద్ద‌లు కొట్టారు. వ్యాక్సిన్ వేయించుకుంటేనే తాము ఆప‌రేష‌న్ చేస్తామ‌ని వైద్యులు చెప్పారు. ఇప్పుడు ఈ సంఘ‌ట‌న వివాదంగా మారింది.  కాగా అమెరికా జనాభాలో 63 శాతం మంది ప్రజలు రెండు డోసుల టీకాను తీసుకోగా, 40 శాతం మంది అమెరికన్లు బూస్టర్ డోస్‌ను కూడా వేసుకున్నారు.
చదవండి: అరుణాచల్ యువకుడిని అప్పగించేందుకు ఓకే చెప్పిన చైనా

Videos

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

మన ప్రశ్నలకు బాబు, పురందేశ్వరి, పవన్ కు పిచ్చి, పిచ్చి కోపం వస్తుందంటా..!

వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..!

కొడాలి నాని ఎన్నికల ప్రచారం.. బ్రహ్మరథం పట్టిన గుడివాడ ప్రజలు

జనంతో కిక్కిరిసిన మైదుకూరు

Photos

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)