amp pages | Sakshi

అందుకే టీఆర్‌ఎస్‌ నుంచి బూర నర్సయ్య గౌడ్‌ బయటికి.. 

Published on Wed, 10/19/2022 - 13:41

టీఆర్‌ఎస్‌ నుంచి డాక్టర్‌ బూర నర్సయ్య గౌడ్‌ బయటికి రావడం ఆత్మగౌరవ ప్రకటనగా భావించాలి. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర సాధారణమైంది కాదు. హైదరాబాదులో లాప్రోస్కోపిక్‌ సర్జన్‌గా మంచి పేరున్న ఆయన ఒకవైపు వృత్తిని కొనసాగిస్తూనే... మరోవైపు డాక్టర్స్‌ సంఘ అధ్యక్షులుగా, తెలంగాణ జేఏసీలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఆయన ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద దాదాపుగా 200 మంది డాక్టర్లు నిరాహార దీక్షలు చేపట్టారు. మిలియన్‌ మార్చ్, సాగరహారం లాంటి అనేక ఉద్యమ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ప్రత్యేక తెలంగాణ ఏర్పాడడానికి కారకులలో ఆయన ఒకరయ్యారు. 

ప్రత్యేక రాష్ట్ర అవతరణ తరువాత జరిగిన ఎన్నికలలో బోనగిరి నుండి ఎంపీగా గెలిచి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి మేలు జరిగే పనులు చేశారు. అంతే కాకుండా యాదాద్రి గుడి పునఃనిర్మాణంలో ఆయన పాత్రను తక్కువగా అంచనా వేయలేము. గౌడ సామాజిక వర్గానికి కోకాపేటలో 5 ఎకరాల భూమి కేటాయించి, భవన నిర్మాణం కోసం 5 కోట్ల రూపాయలు మంజూరు చేయించడంలో ప్రధాన పాత్ర పోషించారు. అలాగే గీతన్నలు ప్రమాదవశాత్తూ తాటిచెట్టు పైనుండి కిందపడి చనిపోతే గతంలో ఉన్న రూ. 50,000  నష్టపరిహారాన్ని రూ. 5 లక్షలకు పెంచేలా చేసి బాధిత కుటుంబానికి ఆసరాగా నిలిచే విధంగా కృషి చేశారు. 

ఈ నేపథ్యంలో రెండవసారి జరిగిన ఎన్నికలలో అధికార పార్టీ అగ్రకుల నాయకుల కుట్రల వ్యూహాలతో ఓడిపోయారు. ఆ తర్వాత నర్సయ్యకు టీఆర్‌ఎస్‌లో తగిన గౌరవం, ప్రాధాన్యం లభించలేదు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన టికెట్‌ ఆశించినా ఫలితం లేకపోయింది. ఆధిపత్య కులానికి చెందిన వ్యక్తికి కేసీఆర్‌ టికెట్‌ ఇచ్చారు. దీంతో ఆయన టీఆర్‌ఎస్‌లో ఉన్న అణచివేత ధోరణిని నిరసిస్తూ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇది ముమ్మాటికీ సమర్థనీయమైన చర్య. (క్లిక్ చేయండి: టీఆర్‌ఎస్‌ను వీడుతానన్న వార్తల్లో వాస్తవం లేదు)

– డాక్టర్‌ మాచర్ల మొగిలి గౌడ్‌, హైదరాబాద్‌

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)