రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సతమతం చేసే సైనసైటిస్ నుంచి ఇలా ఉపశమనం పొందండి..
Published on Sat, 05/14/2022 - 15:20
Sinusitis Home Remedies: ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం అని లేకుండా చాలా మందిని పీడించే సమస్య సైనసైటిస్. తరచూ ముక్కులు మూసుకుపోతూ శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం సైనసైటిస్ లో కనిపించే సమస్యల్లో ప్రధానమైనది. చికిత్స తీసుకున్నా తరచు తిరగబెట్టే ఈ సమస్యకు నివారణ మార్గాలు తెలుసుకుందాం.
వైరస్, బాక్టీరియా, ఫంగస్ కారణంగా వచ్చే సైనస్ వ్యాధి వల్ల ముక్కుతోపాటు గొంతు సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. తలనొప్పి కూడా వస్తుంది. కొన్ని రోజులపాటు పట్టి పీడించే ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు చిన్న చిన్న చిట్కాలు ఎంతగానో దోహదపడతాయి.
- ఉల్లి, వెల్లుల్లి రేకులను తింటే సైనసైటిస్ బాధ తగ్గుతుంది. వంటకాల్లో ఉల్లి, వెల్లుల్లిపాయలను విరివిగా వాడితే మంచిది.
- మామిడి పండ్లు లభించే కాలంలో వాటిని బాగా తినాలి. వీటిలోని ‘ఎ’ విటమిన్‌తో మిగతా ఔషధ గుణాలు సైనసైటిస్ వంటి ఇన్‌ఫెక్షన్లను నివారిస్తాయి.
- టీ స్పూన్ జీలకర్రను వేయించి పొడిచేసి, అందులో రెండు స్పూన్ల తేనె కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. జీలకర్రను పల్చని కాటన్ వస్త్రంలో కట్టి వాసన పీల్చాలి.
- 250 మిల్లీ లీటర్ల నీటిలో టీ స్పూన్ మెంతులను వేసి బాగా మరిగించి కషాయం కాయాలి. ఈ కషాయాన్ని రోజుకు నాలుగుసార్లు తీసుకోవాలి.
- 300 మిల్లీ లీటర్ల క్యారట్ రసంలో 200 మిల్లీ లీటర్ల పాలకూర రసం కలిపి రోజుకు ఒకసారి తాగాలి.
- దీర్ఘకాలంగా ఉండే సైనసైటిస్ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదు.. అయితే కారం టీ సైనస్ నుంచి మంచి ఉపశమనం ఇస్తుంది. ఓ కప్పు మరిగించిన నీళ్లలో అర టీస్పూను కారం, రెండు టీస్పూన్ల తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి గోరువెచ్చగా రోజుకి రెండుసార్లు తాగితే సైనస్ నుంచి ఉపశమనం కలుగుతుందట.
#
Tags