amp pages | Sakshi

Health Tips: సీజన్‌ కదా అని మామిడి పండ్లు లాగించేస్తున్నారా? ఇవి తెలిస్తే..

Published on Tue, 05/03/2022 - 11:07

Summer Tips- Mango Top Health Benefits: పండ్లలో రారాజు మామిడి. మరి వేసవి అంటేనే మామిడి పండ్ల సీజన్‌ కదా! ప్రతి ఒక్కరు కనీసం ఒక్కసారైనా ఈ పండ్లను టేస్ట్‌ చేస్తారు. అయితే, కేవలం రుచికి మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలో మామిడి తనకు తానే సాటి. మామిడి పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు తెలుసుకుందామా?!

100 గ్రాముల మామిడి పండులో లభించే పోషకాలు
►ప్రొటిన్‌- 1.4 గ్రాములు
►కార్బోహైడ్రేట్స్‌-24.7 గ్రాములు
►షుగర్‌- 22.5 గ్రాములు
►ఫైబర్‌- 2.6 గ్రాములు
►కేలరీలు 60
►విటమిన్‌ సీ- రోజూ ఓ మామిడి పండు తింటే 67 శాతం లభిస్తుంది.
►వీటితో పాటు కాపర్‌, థయామిన్‌, మోగ్నీషియం, నియాసిన్‌, పొటాషియం, రైబోఫ్లావిన్‌ కూడా ఉంటాయి.

మామిడి ఆరోగ్య ప్రయోజనాలు
►మామిడి పండులో విటమిన్‌ ఏ, విటమిన్‌ సీతో పాటు కెరోనాయిడ్స్‌ ఉంటాయి. ఇవన్నీ రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో తోడ్పడతాయి.
►ఇక ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది.
►ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. మహిళలు మామిడి పండ్లు తినడం వల్ల ఐరన్‌, కాల్షియం తగు పాళ్లలో లభిస్తాయి.
►మామిడిలోని ఎంజైమ్‌లు ప్రొటిన్‌ను విచ్ఛిన్నం చేస్తాయి. అధిక ఫైబర్‌ను కలిగి ఉంటుంది కాబట్టి ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. 

►ఇందులో విటమిన్‌ ఏ పుష్కలం కాబట్టి కంటి సమస్యలు దూరమవుతాయి. పొడిబారిన కళ్లు, రేచీకటిని నివారించడంలో ఇవి తోడ్పడతాయి.
►మామిడిలో ఉండే పోషకాల కారణంగా ఒక్క పండు తింటే చాలు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇందులోని ఫైబర్‌ జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేయడమే ►కాకుండా అదనపు కేలరీలను కరిగిస్తుంది. తద్వారా బరువు తగ్గడంలో తోడ్పడుతుంది.

►ఇందులో టార్టారిక్‌, మాలిక్‌ యాసిడ్స్‌ ఎక్కువ. సిట్రిక్‌ ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి శరీరాన్ని సమతుల్యంగా ఉంచడంలో సాయం చేస్తాయి.
►ఇక మధుమేహంతో బాధపడే వారు మామిడి ఆకులను తింటే మేలు. ఐదు నుంచి ఆరు ఆకులను నీటిలో వేడిచేసి.. రాత్రంతా నానబెట్టి తెల్లవారుజామున వడకట్టి తాగితే మంచి ఫలితం ఉంటుంది. మామిడి గ్లేసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువ. షుగర్‌ను నియంత్రణలో ఉంచుతుంది.

►చెడు కొలెస్ట్రాల్‌ను నివారిస్తుంది.
►యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. క్వార్సెటిన్‌(కాన్సర్‌ కణాలను నశింపజేస్తుంది), ఫిసెటిన్‌, ఐసోక్వెర్సిటిన్‌, ఆస్ట్రాగాలిన్‌, గాలిక్‌ యాసిడ్‌, మిథైల్‌ గాలేట్‌.. ఇవన్నీ కాన్సర్‌ నిరోధకాలుగా పనిచేస్తాయి. బ్రెస్ట్‌ కాన్సర్‌, కొలన్‌ కాన్సర్‌, ప్రొస్టేట్‌ కాన్సర్‌, లుకేమియాను నివారించడంలో తోడ్పడతాయి.

చదవండి👉🏾 Thati Munjala Smoothie: తాటి ముంజలలో ఫైటో కెమికల్స్ పుష్కలం.. కాబట్టి..

Videos

ఏపీ ఎన్నికలపై సీఈఓ ముకేశ్ కుమార్ కీలక ప్రెస్ మీట్

టీడీపీ నాయకుల దాష్టీకం..

జగన్నాథుడి జైత్రయాత్ర తథ్యం..కూటమి కుట్రలు పారలేదు

కేతిరెడ్డి పెద్ద రెడ్డి ఇంట్లో పోలీసుల వీరంగం

వైఎస్సార్సీపీ గెలుపుతో చంద్రబాబు రథచక్రాలు విరిగిపోతాయి...

గవర్నమెంట్ పాజిటివ్ వోట్ ముఖ్యంగా మహిళలు..గ్రాఫ్ చూస్తే..!

ఏపీలో రికార్డ్ స్థాయిలో పోలింగ్‌..

ప్లీజ్ నన్ను ట్రోల్ చేయండి..

మళ్లీ కలకలం రేపుతున్న సుచిత్ర లీక్స్..

ప్రేమలు హీరోయిన్ తో ప్రేమలో పడనున్న రౌడీ..

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)