amp pages | Sakshi

అందాలరాశిని పెళ్లాడి అదే ఇంట్లో కాపురం పెట్టాడు.. అయితే అంతకంటే ముందే!

Published on Sun, 03/06/2022 - 15:05

నిశబ్దపుచెరలో చిక్కిన ఒంటరితనానికీ, నిశీధి నీడలో నక్కిన రాతిరికీ.. అసలైన రారాజు ‘భయం’. ఆ భయం తెరలు మనసుని అలముకున్నప్పుడు.. ఎక్కడో దూరంగా కుక్క మొరిగినా.. కాస్త దగ్గర్లో పిల్లి నడిచినా.. చివరికి చిరుగాలి వీచి చిన్న కాగితం ముక్క రెపరెపలాడినా సరే.. గుండె అదరడం ఖాయం.

అలాంటిది ఇంట్లోనే ఆత్మలు తిరిగితే? దెయ్యాలు వికృత చేష్టలు చేస్తుంటే? ఆ ఊహే వెన్నులో వణుకు పుట్టిస్తోంది కదూ? అమెరికాలోని ది బెల్లెయిర్‌ హౌస్‌ అలాంటిదే. పరిశోధకులే పలు నిర్ధారణలతో నిరూపించిన నిజమిది. అసలు ఆ ఇంట్లోకి ఆత్మలు ఎలా వచ్చాయి? ఎలా గుర్తించారు? చదవండి ఈ వారం మిస్టరీలో..

అది 1847. అమెరికాలోని ఒహైయో రాష్ట్రంలోని బెల్లెయిర్‌ విలేజ్‌లో ఎకరం స్థలంలో ఈ ఇంటిని నిర్మించారు. అది ఒహైయో నదీతీర ప్రాంతం. ఆ ఇంటి భూగర్భంలో మైనింగ్‌ జరుగుతూ ఉండేది. జాకోబ్‌ హెతెరింగ్టన్‌ అనే గనుల తవ్వకాల వ్యాపారి.. ఎలిజా ఆర్మ్‌స్ట్రాంగ్‌ అనే అందాలరాశిని పెళ్లాడి అదే ఇంట్లో కాపురం పెట్టాడు. అయితే పెళ్లికి ముందు మొదటిసారి జాకోబ్‌ని కలవడానికి ఆ ఇంటికి వచ్చిన ఎలిజా.. ఒహైయో నదీతీరంలో ఆకాశం నుంచి రాలి పడిన ఓ తారను చూసింది.

అలా చూస్తే అమెరికన్లు దాన్ని అపశకునంగా భావిస్తారు. ఊహించినట్లే పెళ్లి తర్వాత ఎలిజా ఆ ఇంట్లో ఎన్నో విచిత్రపరిణామాలు చూసిందనేది వినికిడి. దానికి కారణం ఆ ఇంటి సమీపంలో ఒహైయో నది ఒడ్డునే 1754 నుంచి 1763 వరకూ ఫ్రెంచ్‌–ఇండియన్‌ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో చనిపోయిన వారంతా అక్కడే ఆత్మలుగా తిరుగుతున్నారని అప్పట్లో విస్తృత ప్రచారం జరిగింది స్థానికంగా. 

మరోవైపు ఇంటి వెనుకున్న ఓ గుహలో షానీ జాతి అమెరికన్లు.. చనిపోయిన తమ వంశస్థుల శవాలను అక్కడే పూడ్చిపెట్టేవారు. అలా పూడ్చిన సమాధుల్లో క్షుద్రపూజలు చేసే మంత్రగాళ్ల మృతదేహాలూ ఉండటంతో ఆ నెగెటివ్‌ ఎనర్జీ.. బెల్లెయిర్‌ హౌస్‌ చుట్టే తిరుగుతోందని ఆనాటి  హారర్‌ వార్త. ఆ నేపథ్యంలో ఆ ఇంట్లో ఓ దుర్ఘటన జరిగింది. మైనింగ్‌ వ్యాపారిగా ఉన్న జాకోబ్‌.. అంచలంచెలుగా ఎదుగుతున్న సమయమది.

ఆ ఇంటి భూగర్భంలో ఉన్న ఓ గనిలో అగ్ని ప్రమాదం జరిగి 42 మంది సజీవదహనం అయ్యారు. ఆ నష్టనివారణలో జాకోబ్‌ చాలా ఆస్తుల్ని కోల్పోయాడు. కొంతకాలానికి జాకోబ్‌ చనిపోతూ.. తన గనుల వ్యాపారాన్ని కొడుకు అలెక్స్‌కి అప్పగించాడు. జాకోబ్‌ మనవరాలు లైడ్‌ కూడా అలెక్స్‌కి మైనింగ్‌ వ్యాపారంలో తోడుగా నిలిచింది. ఆ ఇంట్లో జరిగిన పరిణామాలతో అలెక్స్‌ చాలా ఇబ్బందిపడ్డాడు. ‘దెయ్యాలు నన్ను చంపేస్తాయి’ అంటూ చాలా భయపడేవాడు.

పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తించడంతో ఆస్పత్రి పాలయ్యాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే మైనింగ్‌ వ్యాపారం చేజెక్కించుకున్న లైడ్‌ ఆ ఇంట్లోని డైనింగ్‌ రూమ్‌లో శవమై కనిపించింది. మేరీ అనే ఆ ఇంటి పనిమనిషి కూతురు ఇంటి కిటికీ నుంచి కిందపడి చనిపోయింది. దాంతో ఎన్నో ఏళ్లు ఆ ఇల్లు ఖాళీగానే ఉంది. అయితే ఇంట్లో ఎవ్వరూ లేకపోయినా ఎవరో కదలాడుతున్నట్లు.. లోపల ఎవరో ఉన్నట్లు.. కిటికీల్లోంచి ఎవరో తొంగి చూస్తున్నట్లుగా అనిపించేదట స్థానికులకు.

పారానార్మల్‌ ఇన్వెస్టిగేటర్, రైటర్, ప్రస్తుత ఇంటి యజమాని క్రిస్టిన్‌ లీ అనే మహిళ కూడా ఆ ఇంట్లో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొంది. దాంతో ఆ ఇంటి చరిత్రపై.. అసలు ఇంట్లో ఏం జరుగుతోంది అనే దానిపై పరిశోధనలు చెయ్యడం మొదలుపెట్టింది. దానికి సంబంధించి ‘పారానార్మల్‌ కన్ఫెషన్‌’ అనే పుస్తకమూ రాసింది. అందులో అక్కడున్న దెయ్యాల గురించి, వాటి ప్రవర్తన గురించి వివరించింది.

అంతేకాదు కొందరి పరిశోధకుల సాయంతో అక్కడ నిజంగానే ఆత్మలు ఉన్నాయని నిరూపించింది. 20వ శతాబ్దం నుంచే ఆ ఇల్లు దెయ్యాల వశమైందనీ, రకరాకాల నెగెటివ్‌ ఎనర్జీలన్నీ అక్కడ పోగయ్యాయనీ, అందులో మంత్రగాళ్లు, సైనికులు ఇలా చాలా ఆత్మలు ఉన్నాయనీ పరిశోధకులు తేల్చారు. అక్కడ ఆత్మలతో మాట్లాడిన వీడియోలు యూట్యూబ్‌లో కూడా బాగా వైరల్‌ అయ్యాయి.

ప్రస్తుతం క్రిస్టిన్‌ లీ ఆధ్వర్యంలో.. 175 ఏళ్ల నాటి ఈ ఇల్లు ఆత్మల నిలయంగా మారి ఉత్సాహవంతులు, సాహసికులకు రాత్రిళ్లు విడిది ఇచ్చే టూరిస్ట్‌ ప్రాంతంగా మారిపోయింది. అక్కడకి వెళ్లి కొన్ని గంటలు ఆ ఇంట్లో గడిపి, అక్కడ జరిగే వింతలను స్వయంగా ఆస్వాదిస్తున్నారు భూతప్రేతాత్మ ప్రియులు. తమ అనుభవాలను ఎంతో గొప్పగా ప్రపంచంతో పంచుకుంటున్నారు.

మొత్తం ఐదు కారణాలు
ఆ ఇంటి నుంచి  ఆకాశంలోకి చూస్తే.. అంగారక, శని, బుధ, శుక్ర, గురు గ్రహాలు కనిపిస్తాయట. ఆ గ్రహాల నెగెటివ్‌ ప్రభావం కూడా ఆ ఇంటిపై ఉండవచ్చునని పరిశోధకులు  తేల్చారు. మొత్తంగా.. యుద్ధంలో సైనికుల ఆత్మలు, ఆకాశం నుంచి రాలిన తార, గుహలో సమాధులు, గనిలో ప్రమాదం, గ్రహాల ప్రభావం.. ఇలా ఐదు ప్రధాన కారణాలతో ప్రేతాత్మలు, నెగెటివ్‌ ఎనర్జీలు బెల్లెయిర్‌ హౌస్‌పై పడ్డాయనేది పరిశోధకుల మాట.

‘చనిపోయిన తర్వాత జీవితం గురించి తెలుసుకోవాలంటే.. ఆ ఇంటికి వెళ్లాల్సిందే’ అంటున్నారు సాహసికులు. ఏది ఏమైనా అమెరికాలో దెయ్యాల భయంతో ఖాళీ అయిన నాలుగు అతిపెద్ద ఇళ్లల్లో ఇదీ ఒకటి. నిజంగానే ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయా? స్థానికంగా ఉన్న భయాన్ని అవకాశంగా తీసుకుని.. టూరిజం డెవలప్‌మెంట్‌ కోసం సాగుతున్న డ్రామానా అనేది నేటికీ మిస్టరీనే.
-సంహిత నిమ్మన

చదవండి: Mystery- Lansa Flight 508: 10 వేల అడుగుల పైనుంచి ఆమె కూర్చున్న కుర్చీ కిందపడింది.. చుట్టూ విషసర్పాలు.. అయినా

#

Tags

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)