amp pages | Sakshi

ఆత్మ గలవాడి కథ.. ఆయన మరణం కూడా చడీ చప్పుడు లేకుండా..

Published on Tue, 11/29/2022 - 14:25

కాళ్ల సత్యనారాయణ ప్రపంచాన్ని ఎన్నడూ  లెక్క చెయ్యలేదు, ప్రపంచమూ అతణ్ణి అలాగే  పట్టించుకోలేదు.  అతని కవిత నిరూపం, ఆయన గానం ఏకాంతం, కుంచె ధరించిన ఆ చేయి నైరూప్యం, తను తొక్కిన రిక్షా పెడల్ పై జారిన చెమట చుక్క  నిశ్శబ్దం.  

ఆయన మరణం కూడా పెద్దగా ఎటువంటీ  చప్పుడు  చెయ్యకుండా ప్రపంచాన్ని దాని మానన దాని రణగొణ ధ్వనుల్ని దానికే వదిలేసి మనకు సెలవన్నారు. చిత్రకారుడు, కవి, రిక్షా పుల్లర్, స్క్రీన్ ప్రింటర్. తన లోకపు నవ్వుల  వేదాంతి కాళ్ళ సత్యనారాయణ నవంబరు 24 తెల్లవారు ఝామున ప్రపంచపు పోకడ నుండి  నిష్క్రమించారు. దాన్ని మనం మరణం అనుకోవచ్చు.

గత ఇరవై రోజుల నుంచి మృత్యుశయ్యపై  మేను వాల్చి ఉన్న ఈ మనిషి అంతకు  రెండు రోజుల ముందే తన బాల్య మిత్రులు కడుపు గంగాధర్ కోరిక మేరకు తన  జీవితానికి అక్షర రూపం ఇవ్వడం మొదలు పెట్టారు. రెండు పేరాల రచన తరువాత  ఈ పనిని మాత్రం ప్రపంచం  ముందుకు ఎందుకు పరవాలి అనిపించిందో ఏమో!   వ్యక్తిగతంగా ఒకరిద్దరు మిత్రులతో పంచుకున్న ఆయన, వారి గుడిసెలోని కిరసనాయలు దీపం ముందు పలికి మాటలు ఇవి.

ఈ కాసిన్ని మాటల తరువాత నేను ఆయనతో ఆనాటి వాన చినుకులు అనే కథ ఒకటి వ్రాయించ ప్రయత్నించాను. నా మరో మిత్రులు వేమూరి సత్యనారాయణ గారి  గత ముప్ఫయ్ ఏళ్లక్రితం నుంచి కంటున్న కల ఈ కథల పుస్తకం. బహుశా అంతా సవ్యంగా ఉండి ఉండుంటే  ఆ పుస్తకంలో కాళ్ల గారి రిక్షావాడి కథ అందులో ఉండి ఉండేది. 

‘ఓ జ్ఞాపకం. నేను రెండుమూడు తరగతుల్లో వున్నప్పుడే  బొమ్మలెయ్యడం ఇష్టం. నాలుగైదు తరగతులకొచ్చేసరికి ఇష్టం పిచ్చిగా మారింది. ఆ వయసులో మా కుటుంబం బీదరికం కంటే దీనంగా వుండేది. రాత్రిపూట కోడిగుడ్డు చిమ్నీ కిరసనాయిల్ దీపం ముందు చదువుకుంటున్నట్టు నటించేవాణ్ని.అంతకుముందే  మా అమ్మ హెచ్చరించేది ‘నాయనా కిరసనాయిల్ రేపటిక్కూడా అదే‘నని.

ఆ దెబ్బకి ప్రాణం గిలగిల్లాడిపోయేది.  రిక్షా తొక్కితొక్కీ మా నాన్నా, పాచి పనులు చేసి మా అమ్మా అలిసిపోయి, ఎప్పుడెప్పుడు నిద్రపోతారా అని చూసేవాణ్ని. అంతకు ముందే దీపాన్ని గోరంత చేశేవాణ్ని. వాళ్లు నిద్రపోయారన్న సంకేతాలు రాగానే...ఇక   నా అస్త్రాలు (అంగుళన్నర పెన్సిల్‌ ముక్క, అరిగిపోయిన లబ్బరు, పొద్దున బడిలో పక్కోడి నోటు పుస్తకం లోంచి కొట్టేసిన తెల్లకాయితం)తీసేవాణ్ని ధైర్యంగా.

కానీ నా ముందున్న ఆ గోరంత దీపాన్ని పెంచే ధైర్యం లేపోడంతో అది అలా మిణుకుతూనే వుండేది. ఐనా, ఎక్కళ్లేని ఉత్సాహంతో బొమ్మ మొదలెట్టేవాణ్ని. ఆ క్షణాల్లో, ఈ ప్రపంచంలో నేనొక్కణ్నే. ఎవరన్నా వుంటే... నాతరవాతే. అలాగ ఎంతసేపుండేవాడినో! 

నా పిచ్చి అమ్మా నాన్నలు ఒళ్లెరక్క నిద్రపోతుంటే అలివికానంత ఆనందంగా వుండేది. వాళ్లు హాయిగా నిద్రపోతున్నారని కాదు, ఇక ఆ సమయంలో నాకు యే అడ్డూ లేదని. ఎలాటి కాలసూచికలూ లేని ఆ యింట్లో, నా లోకంలో వున్నప్పుడు, ఏదో కవుఁరుకంపు యీలోకంలోకి లాగింది.

ఏదో కాలుతుంటే వచ్చే దుర్వాసన అది. ఆవేళప్పుడు ఏదో తగలబడుతున్నట్టనిపించి భయవేఁసింది. తీరా చూస్తే కాలింది నాజుత్తే, దానివల్లే కవుఁరుకంపు. ఏమయిందంటే,నాముందున్నది గుడ్డి దీపంబుడ్డి, దాని వెలుగెంత! నేను వేసేబొమ్మ కోసం బాగా కిందకి వంగితే చిమ్నీలోంచి వచ్చే సెగకి నా జుత్తు కాలిందన్నమాట.

కొత్తాపాతల మధ్య తేడాలెప్పుడూ వుండేవనకుంటా. నాకైతే నాలుగు తరాల మనుషులు తెలుసు. వీళ్ల మధ్య అప్పుడప్పుడూ వెటకారాలూ వెక్కిరింతలూ నడిచేవి. ‘ఏ పింగూ లేపోతే క్రాపింగు' ,  ‘పుటోవులు దిగితే ఆయుర్దాయం తగ్గిపో‘ద్దని, అప్పుడప్పుడే మొదలౌతున్న ఫొటోగ్రఫీ మీద అపనమ్మకమూ, అల్యూమినియం పాత్రల్లో వండుకునీ తింటే అనారోగ్యం పాలవుతామనీ.... ఇలా  ఎన్నో తేడాలు. ఐనా వాళ్ల cultural space కాపాడుకునేవారు.

అందుకే నిన్నామొన్నటి వరకూ తోలుబొమ్మలు, కీలుబొమ్మలు, హరికథలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, గొల్లసుద్దుల్లాటి కళా రూపాలు బతికొచ్చాయి. ఇప్పుడు, ఏ మాత్రం పసలేని అభిరుచుల్ని తృప్తిపరచడానికి టీవీతల్లే దిక్కు. ఇప్పుడు పెరిగిన సాంకేతిక జ్ఞానంతో ఇప్పడున్నవాటితో పాటు, పాతరూపాల్ని ఆధునికం చేసే ఓపికా సమయమూ ఈ తరానికి లేపోడం విషాదం.
-అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి

చదవండి: Sarah Baartman Life Story: విధివంచితురాలి యథార్థ గాధ: ఆమె శరీర భాగాలను ఆడా మగ, ముసలీ ముతక గొడుగు మొనలతో పొడిచి..

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)