amp pages | Sakshi

జుట్టు రాలడం, తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా? ఈ టానిక్‌ ట్రై చేయండి

Published on Thu, 12/14/2023 - 10:01

బ్యూటీ టిప్స్‌

బీట్‌రూట్‌ ఒకటి తీసుకుని చెక్కు తీసి ముక్కలుగా తరగాలి. రెండు ఉసిరి కాయలను గింజలు తీసేసి ముక్కలుగా కోయాలి. వీటికి పన్నెండు రెమ్మల కరివేపాకు, గ్లాసు నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని పదినిమిషాల పాటు మీడియం మంట మీద మరిగించాలి. చక్కగా మరిగాక దించేసి చల్లారిన తరువాత ఈ రసాన్ని వడగట్టి సీసాలో నిల్వచేసుకోవాలి. ఈ టానిక్‌ను వారానికి రెండు మూడుసార్లు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. రెండు గంటల తరువాత సాధారణ షాంపుతో కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చే స్తే కుదుళ్లకు పోషకాలు అందుతాయి. రక్తప్రసరణ చక్కగా జరిగి జుట్టు ఊడడం తగ్గుతుంది. చివర్లు చిట్లకుండా చక్కగా పెరుగుతాయి.

► మరుగుతున్న రెండు గ్లాసుల నీటిలో మూడు టేబుల్‌ స్పూన్ల టీ పొడి, పది గులాబీ పువ్వులు వేసి పదినిమిషాల పాటు మరిగించాలి. ఇది చల్లారిన తర్వాత వడగట్టి ఒక సీసాలో పోయాలి. తలస్నానం చేసిన జుట్టుకు ఈ డికాషన్‌ను పట్టించి, టవల్‌ చుట్టుకోవాలి. నీటితో కడగకూడదు. ఇది కండీషనర్‌లా పనిచేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

► చాలామంది జుట్టుకు నూనె రాసుకోవడం మానేస్తుంటారు. ఇలా చేయడం వల్ల జుట్టు జీవం కోల్పోతుంది. అందుకే తలస్నానానికి ముందు తప్పనిసరిగా కొబ్బరినూనెను తలంతా పట్టించాలి. 2 గంటల తర్వాత స్నానం చేస్తే జుట్టు పుట్టుకుచ్చులా మెరుస్తుంది. 

► కోడిగుడ్లులోని  ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ జుట్టుకు మంచి పోషణ అందిస్తాయి. వారానికి ఒకసారి ఎగ్‌వైట్‌ను కుదుళ్లకు పట్టించి 20-30 నిమిషాలు పట్టించి, ఆ తర్వాత గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా, సిల్కీగా మారుతుంది. 

► రెండు టేబుల్‌ స్పూన్ల మందారం పొడి, రెండు టేబుల్‌ స్పూన్ల ఉల్లిపాయ రసం కలిపి చూర్ణం చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.

► రెండు టేబుల్‌ స్పూన్ల ఎండిన మందారాల పొడికి కలబంద, ఉసిరి పొడి, పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తుంటే తెల్లని జుట్టు సమస్య తగ్గుతుంది.

జెల్‌ మెరుపులు
టేబుల్‌ స్పూను పంచదార పొడిలో స్పూను వేడినీళ్లు పోసి కలపాలి. దీన్లో రెండు టీస్పూన్ల పచ్చి పాలు, స్పూను అలోవెరా జెల్‌ వేసి కలపాలి.  శుభ్రంగా కడిగిన ముఖానికి ఈ మిశ్రమాన్ని రాసి మర్దన చేయాలి. పదినిమిషాల పాటు ఆరనిచ్చి కడిగేయాలి. వారానికి మూడు సార్లు ఈ ప్యాక్‌ వేయడం వల్ల చర్మానికి తేమ అంది, మృదువుగా నిగారింపుతో కనిపిస్తుంది. 

Videos

Watch Live: కర్నూలులో సీఎం జగన్ ప్రచార సభ

అంతా మాయ..సేమ్ 2 సేమ్.. 2024 మోదీ ఎన్నికల స్పీచ్ పై డిబేట్

కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం

ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం

పచ్చ మద్యం స్వాధీనం..

బాబును నమ్మే ప్రసక్తే లేదు..

మహిళలపైనా పచ్చమూకల దాష్టీకం..

నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

విజనరీ ముసుగేసుకున్న అవినీతి అనకొండ

విజయవాడలో సాక్షి ప్రజా ప్రస్థానం

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)