amp pages | Sakshi

రొమ్ముక్యాన్సర్‌.. కొత్త మార్పు తెచ్చే పరిశోధన

Published on Sun, 07/10/2022 - 10:30

రొమ్ముక్యాన్సర్‌ బాధితులు రాత్రివేళ నిద్రపోగానే... రొమ్ముక్యాన్సర్‌ కణాలు ఒళ్లు విరుచుకుని నిద్రలేస్తాయంటున్నారు పరిశోధకులు. ఈ పరిశోధన ఆధారంగా రొమ్ముక్యాన్సర్‌ రోగుల నుంచి పరీక్షల కోసం రక్తాన్ని సేకరించే వేళలు ఇకపై పగటిపూటగాక... రాత్రివేళల్లోకి మారే అవకాశం లేకపోలేదనీ పరిశోధకులు చెబుతున్నారు. అలాగే డాక్టర్లు తాము చేసే బయాప్సీలను మరింత కచ్చితంగా నిర్వహించేందుకు ఈ అంశం తోడ్పడనుందని చెబుతున్నారు ఈ పరిశోధనలో పాలుపంచుకున్న ప్రధాన అధ్యయనవేత్త, ఈటీహెచ్‌ జ్యూరిక్‌ (స్విట్జర్లాండ్‌)కు చెందిన యూనివర్సిటీలోని మాలెక్యులార్‌ బయాలజీ ప్రొఫెసర్‌ నికోలా అసెటో.

ఆయన మాట్లాడుతూ... ‘‘ఈ పరిశోధన కోసం మా సహచరులు ఉదయం నుంచి సాయంత్రం వరకు... అలాగే కొన్నిసార్లు రాత్రివేళల్లోనూ అనేక సమయాల్లో బాధితుల నుంచి రక్తాన్ని సేకరిస్తూ వచ్చారు. ఆ పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది’’ అని వివరించారు. ఇక ఇదే అధ్యయనంలో పాలుపంచుకున్న మాలెక్యులార్‌ ఆంకాలజీ విభాగానికి చెందిన మరో పరిశోధకుడు జోయ్‌ డయామాంటోపౌలో మాట్లాడుతూ ‘‘క్యాన్సర్‌ కణాలు తొలుత ఉద్భవించిన (ప్రైమరీ) ప్రదేశం నుంచి మరో చోటనున్న (సెకండరీకి) కణజాలాలకు వ్యాప్తి చెందుతాయి. నిద్రను కలిగించే మెలటోనిన్‌ ఆ వేగాన్ని  ప్రభావితం చేస్తోంది. మెలటోనిన్‌ చురుగ్గా ఉన్న సమయంలోనే క్యాన్సర్‌ గడ్డ నుంచి కణాలు మరోచోటికి చురుగ్గా ప్రసరిస్తున్నాయి’’ అని వివరించారు.

అయితే నిద్రవేళల్లో క్యాన్సర్‌ విస్తరిస్తుందనే పరిశోధనల ఆధారంగా రాత్రుళ్లు మెలకువతో ఉన్నంత మాత్రాన ఆ అంశం క్యాన్సర్‌ నివారణకూ, వ్యాప్తిని తగ్గించడానికి దోహదపడుతుందనుకుంటే పొరబాటే. సర్కాడియన్‌ రిథమ్‌కు తోడ్పడే మెలటోనిన్‌ తగ్గుదల కారణంగా నిద్రపట్టకపోతే క్యాన్సర్‌ వ్యాప్తి వేగం తగ్గుతుందనుకోవడం తప్పే. నిద్రలేకపోవడం వల్ల కలిగే ఒత్తిడి వల్ల వ్యాప్తి, విస్తరణ మరింత పెరుగుతాయి. అందువల్ల నైట్‌డ్యూటీలు చేసేవారికి క్యాన్సర్‌ ముప్పు తక్కువగా ఉంటుందనుకోవడం సరికాదు. వాళ్లకు ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ కారణంగా క్యాన్సర్‌ ముప్పు ఉంటుంది. అందుకే నైట్‌ డ్యూటీలు చేసేవారు కనీసం ఐదుగంటల పాటైనా నిద్రపోవడం మేలు. పై పరిశోధన వివరాలు ప్రముఖ వైద్య జర్నల్‌ ‘నేచర్‌’లో ప్రచురితమయ్యాయి.
చదవండి: మహిళల క్యాన్సర్లు: ఓ అవగాహన

Videos

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)