amp pages | Sakshi

హలో.. మేము ఏసీబీ! 

Published on Thu, 09/03/2020 - 14:25

కర్నూలు (టౌన్‌): ‘హలో..  నేను ఏసీబీ డీఎస్పీ..  విజయవాడ హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి మాట్లాడుతున్నాం.  మీ అవినీతి కార్యకలాపాల చిట్టా మా వద్ద ఉంది. మీపై  ఫిర్యాదులొస్తున్నాయి.  కేసులు నమోదు చేయాల్సి ఉంటుందం’టూ  ఫోన్లలో బెదిరించి భారీగా డబ్బు వసూలు చేస్తున్న ముఠాలో అరుగురిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.  ట్రైనీ ఐపీఎస్‌ కొమ్మి ప్రతాప్‌ శివ కిషోర్, కర్నూలు టౌన్‌ ఇన్‌చార్జ్‌ డీఎస్పీ వెంకటరామయ్య బుధవారం రెండో పట్టణ పోలీసు స్టేషన్‌ ఆవరణలో  నిందితులను మీడియా ఎదుట ప్రవేశ పెట్టి వివరాలు వెల్లడించారు. 

వెలుగులోకి వచ్చిందిలా...
కర్నూలు నగరంలోని రోడ్లు, భవనాల శాఖ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా పనిచేసే  ఓ అధికారికి  ఏసీబీ అధికారుల పేరుతో  ఫోన్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేశారు. దీనిపై సదరు అధికారి కర్నూలు 2 వ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ మహేశ్వరరెడ్డి ఫిర్యాదు  నమోదు చేసుకుని దర్యాప్తు  వేగవంతం చేశారు. 

పట్టుకున్నారిలా.. 
కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుల ఫోన్‌ కాల్స్, ఖాతాల వివరాలు తెలుసుకున్నారు. వాటి ఆధారంగా నిఘా పెట్టి  కర్ణాటక రాష్ట్రం హోసూరు వద్ద ఇద్దరిని,  అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద నలుగురిని ఫోన్‌ కాల్‌ ఆధారంగా ట్రేస్‌ అవుట్‌ చేసి పట్టుకున్నారు.  పరారీలో ఉన్న  మరో ఇద్దరు జయకృష్ణ (ఏ–1), ఉదయ్‌కుమార్‌ (ఏ–8) కోసం ప్రత్యేక బృందాలçను నియమించామని పోలీసు అధికారులు వెల్లడించారు.  

కీలక శాఖల అధికారులే టార్గెట్‌ 
ముఠా సభ్యులు రాష్ట్రంలో  కీలక శాఖల అధికారులను టార్గెట్‌ చేశారు.  మైనింగ్‌శాఖ, రోడ్లు, భవనాలు, ఇరిగేషన్, ఫ్యాక్టరీలు, మున్సిపల్, కమర్షియల్‌ ట్యాక్స్, పంచాయతీరాజ్‌ శాఖలకు చెందిన వారి ఫోన్‌ నెంబర్లు తెలుసుకుని  బెదిరింపులకు పాల్పడ్డారు. దాదాపు 70 నుంచి 80 మంది అధికారులను బెదిరించారు.   వైజాగ్, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలోని  కొందరు అధికారులు వారిపై పోలీసులకు  ఫిర్యాదులు చేశారు. కాగా  ఇప్పటి వరకు  నిందితులు బెదిరింపుల ద్వారా అధికారుల నుంచి రూ. 14.34 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందన 
కేసు దర్యాప్తును వేగవంతం చేసి ఛేదించిన కర్నూలు టూటౌన్‌ సీఐ మహేశ్వరరెడ్డి, ఎస్‌ఐ సునీల్‌కుమార్,  పోలీసు సిబ్బంది మహీంద్ర, ప్రియకుమార్, రవిలను   జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప కాగినెళ్లి ప్రత్యేకంగా అభినందించారు.   

ముఠాలో అందరూ పాత నేరస్తులే
ఏసీబీ పేరు చెప్పి అధికారుల వద్ద డబ్బులు వసూలు చేస్తూ పట్టుబడిన  వారంతా పాత నేరస్తులే.  వివిధ కేసుల్లో పట్టుబడి జైలుకెళ్లారు.  అక్కడ ఒకరినొకరు పరిచయం పెంచుకుని జత కట్టారు. బెయిల్‌పై బయటికి వచ్చిన తరువాత  బెదిరింపులకు పాల్పడటం మొదలు పెట్టారు.  ఇందుకు కర్ణాటకలో 6 సిమ్‌ కార్డులు తెప్పించుకుని  అందులో 3 సిమ్‌ కార్డుల ద్వారా  అధికారులకు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నట్లు విచారణలో తేలింది.  ముఠాలో అత్యధికంగా రేప్‌కేసుల్లో పట్టుబడిన నిందితులే  ఉన్నారు.   పట్టుబడిన వారిలో  ఏ–1 గా ఉన్న జయకృష్ణ అనంతపురం 3 వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులో ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టు అయ్యాడు.  రెడ్డిపల్లి జిల్లా జైలులో శిక్ష అనుభవించాడు.

అలాగే ఏ–2 తమిటిగొల్ల గంగాధర్‌ కదిరి రూరల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో  బాలికను రేప్‌ చేసిన కేసులో పట్టుబడ్డాడు. ఏ–3 జోలదరాశి సాల్మన్‌ రాజు  కణేకల్లు పోలీసు స్టేషన్‌లో బాలికను రేప్‌ చేసిన కేసులో నిందితుడు.  ఏ–4 బొడ్డు సాయికుమార్‌ బత్తల పల్లి పోలీసు స్టేషన్‌లో  అమ్మాయి కిడ్నాప్‌ కేసులో అరెస్టు అయ్యాడు.  ఏ–5 నారాయణస్వామి హిందూపురం 2 వ పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో బాలికను రేప్‌ చేసిన కేసులో జైల్‌ కెళ్లాడు. ఏ–6 హోసురు నారాయణప్ప గోవిందరాజులు  అనంతపురం 3 వ పట్టణ పోలీసు స్టేషన్‌లో 354 కేసులో అరెస్టు అయ్యాడు.   ఏ–7 హోసూరు గ్రామానికి చెందిన హేమంత్‌కుమార్, ఏ–8 ఉదయ్‌కుమార్‌  ఇతర నేరాలకు పాల్పడి జైలు జీవితం అనుభవించారు. రెడ్డి పల్లి జిల్లా జైలులో ఉన్న సమయంలో   ఏ1 నిందితుడు జయకృష్ణతో మిగతా నిందితులకు పరిచయం ఏర్పడింది. ఎలాగైనా  డబ్బు సంపాదించాలని వారంతా నిర్ణయించుకుని ముఠాగా ఏర్పడ్డారు. 

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)