amp pages | Sakshi

దుండిగల్‌లో తీవ్ర విషాదం: చచ్చినా.. మారరా..?

Published on Mon, 12/13/2021 - 08:15

సాక్షి, హైదరాబాద్‌: డీకే నగర్‌లో విద్యార్థిని దేవి.. పంజగుట్ట వద్ద చిన్నారి రమ్య కుటుంబం.. తాజాగా వారం రోజుల క్రితం బంజారాహిల్స్, నార్సింగిల్లో నలుగురు.. ఇవి సంచలనం సృష్టించి.. రికార్డులకెక్కిన ‘డ్రంకన్‌ డ్రైవింగ్‌’ ఉదంతాలు. వీటికి తోడు ఆదివారం తెల్లవారుజామున దుండిగల్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న మరో ఘోర ప్రమాదమూ ఈ జాబితాలో చేరింది. (చదవండి: మందు కొట్టి.. ఫ్యామిలీని బలిపెట్టాడు)

ఈ దుర్ఘటనలో అక్కడిక్కడే ముగ్గురు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఏటా ఎందరు జైలుకు వెళ్తున్నా, నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా మందుబాబుల్లో మార్పు రావట్లేదు. మద్యం మత్తులోనే వాహనాలు నడుపుతూ ప్రమాదాలను కొనితెచ్చుకోవడంతో పాటు ఎదుటి వారి ప్రాణాలు తీస్తున్నారు.  

తీవ్రమైన సెక్షన్లతో కేసులు పెట్టినా... 
► సాధారణంగా రోడ్డు ప్రమాద ఉదంతాలు చోటు చేసుకున్నప్పుడు పోలీసులు ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ)లోని సెక్షన్‌ 304 (ఎ) కింద కేసు నమోదు చేస్తారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఎదుటి వారికి ప్రాణనష్టం కలిగించడం ఆరోపణలపై దర్యాప్తు చేసి అభియోగాలు మోపుతారు. (చదవండి: నన్ను అడ్డుకుంటే పొడుచుకుంటా..)

► డ్రంకన్‌ డ్రైవింగ్‌ చేస్తూ ప్రమాదంతో ఎదుటి వారి మరణానికి కారణమైన వారిపై ఐపీసీలోని సెక్షన్‌ 304 (పార్ట్‌–2) కింద కేసు నమోదు చేయడం ప్రారంభించారు. అంటే ఓ వ్యక్తి నిర్లక్ష్యంతో ప్రాణం పోయిందే కానీ ప్రాణం పోతుందని తెలిసీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని అర్థం. ఆపై వెంట ఉన్న వారి పైనా ప్రేరేపించడం సెక్షన్‌ కింద ఆరోపణలు జోడిస్తున్నారు.

► ఇలాంటి కేసుల్లో బెయిల్‌ సైతం తొందరగా లభించదు. న్యాయస్థానంలో నిరూపితమైతే గరిష్టంగా పదేళ్ల నుంచి జీవిత ఖైదు లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ఈ సెక్షన్‌ కింద నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్‌ సైతం లభించదు. అయినప్పటికీ మందుబాబుల్లో మాత్రం మార్పు రావట్లేదు.  

డేటాబేస్‌ను సెంట్రలైజ్డ్‌ చేయాలి... 
► మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కడంతో పాటు ర్యాష్‌ డ్రైవింగ్, నిర్లక్ష్య డ్రైవింగ్‌ వల్ల ప్రమాదాలకు కారణమైన, తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన వారి వివరాలతో సమగ్ర ఎల్రక్టానిక్‌ డేటాబేస్‌ సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది.

► ఈ తరహా ఉల్లంఘనుల్లో అత్యధికం యువత, విద్యాధికులే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే మద్యం తాగి ప్రమాదాలు చేసిన వారితో పాటు వాహనాలు నడుపుతూ చిక్కిన వారి వివరాలను ఆధార్‌తో సహా పొందుపరచాలి. ఈ వివరాలను క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టం (సీసీటీఎన్‌ఎస్‌) ద్వారా వివిధ రకాలైన సేవలు అందించే విభాగాలకు అందుబాటులో ఉంచాలి.

► ఆయా విభాగాలు ఇందులోని వివరాలు సరిచూసుకుని తదుపరి చర్యలు తీసుకోవడాన్ని తప్పనిసరి చేయాలి. ప్రధానంగా పాస్‌పోర్ట్, వీసా, జాబ్‌ వెరిఫికేషన్‌ సమయాల్లో ఇలాంటి కేసులు అడ్డంకిగా మారాలి. అప్పుడే మందుబాబులు కాస్త తగ్గే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.      

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)