amp pages | Sakshi

తిక్క కుదిరింది: సోషల్‌ మీడియా స్టార్‌ ‘ఆత్మహత్య నాటకం’

Published on Wed, 07/28/2021 - 19:50

ముంబై: సోషల్‌ మీడియాలో స్టార్‌గా ఎదిగేందుకు కొందరు పిచ్చిపిచ్చి ప్రయత్నాలు చేస్తారు. అందరి దృష్టిలో పడేందుకు వెర్రి వేషాలు వేస్తుంటారు. తాజాగా ఓ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో రూపొందించి సోషల్‌ మీడియాలో విడుదల చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారి పోలీసుల వరకు చేరింది. దీంతో ప్రస్తుతం ఆ యువకుడు కటకటాలపాలయ్యాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం.. ఇర్ఫాన్‌ఖాన్‌ (28) ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్నాడు. ఇప్పీఖాన్‌ అనే పేరిట ఇన్‌స్టా, యూట్యూబ్‌ ఖాతాలు ఉన్నాయి. అతడికి 44 వేల మందికి పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. మరింత మందిని పెంచుకునేందుకు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ వీడియో రూపొందించాడు. ఓ అమ్మాయి తనను ప్రేమించి మోసం చేసిందని.. ఇది తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెబుతూ ఖార్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో పట్టాలపై కూర్చున్నాడు. ఈ సమయంలో తనకు రైలు ఢీకొట్టినట్లు వచ్చేలా ఎడిట్‌ చేశాడు.

ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేయగా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన బాంద్రా పోలీసులు ఇర్ఫాన్‌ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను ఆత్మహత్య చేసుకోకూడదని ఉద్దేశంతో అవగాహన కల్పించేందుకు ఆ వీడియో రూపొందించినట్లు పోలీసులకు ఇర్ఫాన్‌ తెలిపాడు. దీనిపై అతడు క్షమాపణలు చెప్పి ఆ వీడియోను డిలీట్‌ చేశాడు. ఏది ఏమైనా అతడిపై పోలీసులు కేసు మాత్రం తప్పలేదు.

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌