amp pages | Sakshi

సెలవు తీసుకోకుండా పనిచేస్తా.. దిగ్గజాలను భయపెడుతున్న కొత్త 'సీఈఓ'

Published on Sat, 11/11/2023 - 16:37

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో ఉద్యోగాలు పోతాయని, మానవాళికి ముప్పు తలపెడుతుందనుకుంటున్న సమయంలో ఒక కంపెనీ ఏకంగా 'రోబో'ను సీఈఓగా నియమించి దిగ్గజాలకు సైతం దిగులుపుట్టేలా చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కొలంబియాలోని కార్టజేనాలో ఉన్న డిక్టేడార్ స్పిరిట్ బ్రాండ్ ఏఐ బేస్డ్ రోబో 'మికా' (Mika)ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా నియమించింది. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మికా అనేది హాన్సన్ రోబోటిక్స్ హ్యూమనాయిడ్ రోబో. ఇది మనుషుల కంటే వేగంగా పనిచేస్తుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లతో ఖచ్చితమైన డేటా ఆధారాలతో నిర్ణయాలు తీసుకోగలనని డిక్టేడార్ కంపెనీ వీడియోలో మికా వెల్లడించింది. అంతే కాకకుండా 24/7 అందుబాటులో ఉంటానని, వారాంతపు సెలవులు అవసరం లేదని ప్రస్తావిస్తూ.. కంపెనీ ప్రయోజనాలకు అవసరమయ్యే ఏ పనైనా పక్షపాతం లేకుండా చేస్తానని స్పష్టం చేసింది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, ఫేస్‌బుక్ సీఈఓ జుకర్‌బర్గ్‌ల కంటే కూడా మెరుగ్గా పనిచేస్తానని మికా (హ్యూమనాయిడ్ రోబో) నొక్కి చెప్పించి. 

కంప్యూటర్ యుగంలో ఏఐ టెక్నాలజీ గురించి తప్పకుండా అవగాహన కలిగి ఉండాలని, రానున్న రోజుల్లో ఏఐ టెక్నాలజీ అవసరం ఎంతైనా ఉందని హాన్సన్ రోబోటిక్స్ సీఈఓ 'డేవిడ్ హాన్సన్' (David Hanson) తెలిపారు.

ఇదీ చదవండి: ఏ ప్రశ్నకైనా సమాధానం 'చాట్‌జీపీటీ' - ఇంటర్వ్యూకి ఇలా సిద్దమైపోండి!

ఏఐ వల్ల ప్రమాదమా!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మానవాళికి ముప్పు ఉందని గత కొంతకాలంగా చాలా మంది భయపడుతున్నారు. కృత్రిమ మేధను సరిగా వాడకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గూగుల్‌ సీఈఓ 'సుందర్‌ పిచాయ్‌' ఇప్పటికే హెచ్చరించారు. ముప్పు నుంచి బయటపడాలంటే ఏఐ సాంకేతికతపై నియంత్రణ ఉండాలని చెప్పారు.

ఉద్యోగుల పనితీరుని మెరుగుపరచడంలో ఏఐ ఉపయోగపడుతుందని, టెక్నాలజీని ఉపయోగించి ఇప్పటికే కొన్ని సంస్థలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ.. ఏఐ వల్ల ఉద్యోగాలు పోయే అవకాశం లేదని చెబుతున్నారు.

Videos

కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు

గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు

సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)

కొడాలి నాని మనసున్న రాజు గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా

బాహుబలి పట్టాభిషేకం సీన్ తలపించిన సీఎం జగన్ సభ

చంద్రబాబు పై గాడిద సామెత

"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

రైతులను ఉద్దేశించి సీఎం జగన్ అద్భుత ప్రసంగం

Photos

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)