amp pages | Sakshi

SpaceX Starlink: ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌.. సింపుల్‌గా పరిష్కరించిన యువకుడు..!

Published on Sat, 06/19/2021 - 22:23

వాషింగ్టన్‌: మమూలుగా మన దగ్గర ఉండే ఎలక్ట్రానిక్స్‌ గాడ్జెట్స్‌ బాగా వేడెక్కితే ఏం చేస్తాం. కొద్ది సేపు​ వాటిని ఆఫ్‌ చేసి తిరిగి మళ్లీ ఆన్‌ చేస్తాం. ఆరిజోనాకు చెందిన యువకుడు మాత్రం అసాధారణ పద్దతి ఉపయోగించి  తిరిగి ఇంటర్నెట్‌ వచ్చేలా చేశాడు. వివరాలోకి వెళ్లేే.. ఎలన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ కంపెనీ స్టార్‌లింక్‌తో అమెరికాలో ఇంటర్నెట్‌ను ప్రవేశపెట్టింది.  భూమిపై ఏర్పాటుచేసిన  డిష్‌ ఆంటెన్నాతో యూజర్లు ఇంటర్నెట్‌ సేవలను పొందుతారు. కాగా  అప్పుడప్పుడు డిష్‌ ఆంటెన్నాలు ఎక్కువగా వేడెక్కడంతో ఇంటర్నెట్‌ సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని స్టార్‌లింక్‌ తన వినియోగదారులకు ముందుగానే తెలిపింది.

డిష్‌ ఆంటెన్నాలు తిరిగి కూల్‌ డౌన్‌ అయ్యే వరకు ఇంటర్నెట్‌ సేవలను పొందలేరని పేర్కొంది స్టార్‌లింక్‌. ప్రస్తుతం  అమెరికాలోని ఆరిజోనా స్టేట్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ ప్రాంతంలో సుమారు 44 డిగ్రీల నుంచి 55 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో ఆరిజోనాలో ఇంటర్నెట్‌ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.  కాగా ఈ సమస్య ఆరిజోనాకు చెందిన యువకుడికి రావడంతో స్టార్‌లింక్‌ కస్టమర్‌ సర్వీస్‌ను సంప్రదించడంతో కంపెనీ ముందుగానే చెప్పిన విషయానే చెప్పింది. దీంతో విసుగు చెందిన యువకుడు ఇంటర్నెట్‌ డిష్‌పై నీళ్లను స్ప్రే చేశాడు.

వాటర్‌ పోయడంతో డిష్‌ ఆంటెన్నా త్వరగా కూల్‌ డౌన్‌ అయ్యింది. తిరిగి ఇంటర్నెట్‌ సేవలను అతడు పొందగల్గిగాడు. ప్రస్తుతం ఈ  చర్య చర్చనీయాంశంగా మారింది. ఇకపై ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌ అవ్వకుండా ఉండాలంటే డిష్‌ ఆంటెన్నాపై ఒక చిన్న ఫౌంటెన్‌ను ఏర్పాటు చేస్తే అసలు అంతరాయం ఉండదని ఓ నెటిజన్‌ వ్యంగ్యంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

చదవండి: జెఫ్‌ బెజోస్‌ సంచలన నిర్ణయం.. నాసాపై..

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)