amp pages | Sakshi

గృహ రుణాలపై ఎస్‌బీఐ బొనాంజా

Published on Sat, 01/09/2021 - 05:59

ముంబై: గృహ రుణ వడ్డీరేట్లను 30 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) తగ్గిస్తున్నట్లు బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) శుక్రవారం ప్రకటించింది. ప్రాసెసింగ్‌ ఫీజును పూర్తిగా రద్దు చేస్తున్నట్లూ వివరించింది.  కొత్త గృహ రుణ వడ్డీరేట్లను సిబిల్‌ స్కోర్‌ను అనుసంధానిస్తున్నట్లు కూడా బ్యాంక్‌ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. అంటే సిబిల్‌ స్కోర్‌ బాగుంటే, వడ్డీరేట్లు మరింత తగ్గించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. క్తొత వడ్డీరేట్లు చూస్తే...
► రూ. 30 లక్షల వరకూ రుణాలపై వడ్డీరేటు 6.80 వద్ద మొదలవుతుంది.  
► రూ.30 లక్షలుపైబడిన రుణాలపై వడ్డీరేటు 6.95 నుంచి ఉంటుంది.  
► మహిళా రుణ గ్రహీతలకు 5 బేసిస్‌ పాయింట్ల రాయితీ కూడా లభిస్తుంది.  


యోనో యాప్‌ ద్వారా దరఖాస్తుకు 5 బేసిస్‌ పాయింట్ల తగ్గింపు
బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (రిటైల్‌ అండ్‌ డిజిటల్‌ బ్యాంకింగ్‌) సీఎస్‌ షెట్టి ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం, పండుగ సీజన్‌లో కస్టమర్లను ఆకర్షించడం, అందరికీ గృహ సౌలభ్యం లక్ష్యంగా తాజా నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. రూ.5 కోట్ల వరకూ రుణాలకు ఎనిమిది మెట్రో పట్టణాల్లోనూ 30 బేసిస్‌ పాయింట్ల రాయితీ లభిస్తుంది. యోనో యాప్‌ ద్వారా కూడా గృహ రుణ దరఖాస్తు చేసుకోవచ్చు. తద్వారా అదనంగా ఐదు బేసిస్‌ పాయింట్ల వడ్డీ రాయితీ పొందవచ్చు. 2021 మార్చి వరకూ తాజా రేట్లు అమల్లో ఉంటాయి. టాప్‌–అప్‌ గృహ రుణాలకు కూడా అవకాశం ఉంది.  

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌