amp pages | Sakshi

బ్రోకింగ్‌ స్టాక్స్‌ మారథాన్‌

Published on Thu, 11/23/2023 - 05:10

న్యూఢిల్లీ: రిటైల్‌ ఇన్వెస్టర్లు పెద్ద సంఖ్యలోఈక్విటీల వైపు వస్తుండడంతో బ్రోకింగ్‌ స్టాక్స్‌ గడిచిన కొన్నేళ్లలో మంచి రాబడులు తెచ్చి పెట్టాయి. ముఖ్యంగా కరోనా సమయంలో వైరస్‌ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌లో కొత్త ఇన్వెస్టర్లు ఈక్విటీల వైపు అడుగులు వేసేలా చేశాయని చెప్పుకోవాలి. దీంతో ట్రేడింగ్‌ కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయి. కరోనా వైరస్‌ సమసిపోయి, ఇంటి నుంచే పని విధానం కూడా కనుమరుగు అవుతున్నప్పటికీ, మరోవైపు ఈక్విటీ మార్కెట్లో కొత్త ఇన్వెస్టర్ల జోరు ఏ మాత్రం తగ్గలేదు.

ఇప్పటికీ ట్రేడింగ్‌ పరిమాణం గణనీయంగా నమోదవుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఏంజెల్‌ వన్, 5పైసా క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్, జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్, చాయిస్‌ ఇంటర్నేషనల్‌ స్టాక్స్‌ ర్యాలీ రిటైల్‌ ఇన్వెస్టర్ల జోరుకు నిదర్శంగా చెప్పుకోవచ్చు.

ఏంజెల్‌ వన్‌ స్టాక్‌ ఏడాది కాలంలో 90 శాతం రాబడులను ఇచ్చింది. మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ స్టాక్‌ 77 శాతం పెరిగింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ సైతం 21 శాతం రాబడిని ఇచి్చంది. లిస్టెడ్‌ బ్రోకరేజీ సంస్థల విలువ వృద్ధి వెనుక రిటైల్‌ ఇన్వెస్టర్ల భాగస్వామ్యాన్ని ప్రధానంగా చెప్పుకోవాలని ట్రేడ్‌బుల్స్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ భవీక్‌ పాటిల్‌ తెలిపారు.  

డీమ్యాట్‌ ఖాతాల్లో భారీ వృద్ధి
కరోనా తర్వాత డీమ్యాట్‌ ఖాతాల్లో గణనీయ వృద్ధి కనిపించింది. అంతేకాదు భవిష్యత్తులోనూ వీటి పెరుగుదల కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది బ్రోకరేజీ పరిశ్రమకు అనుకూలమని, టెక్నాలజీలో వచి్చన పురోగతి నేపథ్యంలో బ్రోకరేజీ సంస్థలు మరింత మంది క్లయింట్లకు సేవలు అందించగలవని స్టాక్స్‌బాక్స్‌ సీఈవో వంశీ కృష్ట పేర్కొన్నారు.

స్టాక్‌ మార్కెట్లో కనిపించిన నిరంతరాయ ర్యాలీ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించినట్టు చెప్పారు. అక్టోబర్‌ చివరి నాటికి డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య 13.22 కోట్లకు చేరింది. వీటిల్లో అధిక శాతం గడిచిన 11 నెలల కాలంలో ప్రారంభమైనవే కావడం గమనించొచ్చు. ఒకవైపు స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీకితోడు, మరోవైపు ఐపీవోల బంపర్‌ లిస్టింగ్‌ మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.  

ఫలితాలూ అనుకూలమే
సెపె్టంబర్‌ త్రైమాసికంలో బ్రోకరేజీ కంపెనీలు మంచి సానుకూలతలను చూసినట్టు ఎం.స్టాక్‌ (మిరే అస్సెట్‌) రిటైల్‌ స్ట్రాటజీ హెడ్‌ ధర్మేంద్ర లోహర్‌ చెప్పారు. సూచీలు సెప్టెంబర్‌లో ఆల్‌టైమ్‌ గరిష్టాలకు చేరుకోవడం, ఐపీవో ఇష్యూలు పెరగడాన్ని ప్రస్తావించారు. ‘‘సంప్రదాయ, బ్యాంక్‌ బ్రోకర్లు ఎక్కువగా లబ్ధి పొందారు. ఎందుకంటే వీరి ఆదాయం ప్రధానంగా ఈక్విటీల నుంచే ఉంటుంది. ఇది ఆయా సంస్థల లాభాలు, ఆదాయం వృద్ధికి దారితీశాయి’’అని ధర్మేంద్ర లోహర్‌ తెలిపారు.

‘‘కరోనా తర్వాత డీమ్యాట్‌ ఖాతాలు పెద్ద ఎత్తున పెరిగాయి. ఎఫ్‌అండ్‌వో విభాగంలో రిటైల్‌ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం కూడా పెరిగింది. దీంతో గడిచిన కొన్నేళ్లలో బ్రోకరేజీ సంస్థల ఆదాయం గణనీయంగా పెరిగేందుకు దోహదపడింది’’అని స్టాక్స్‌బాక్స్‌ కృష్ణ చెప్పారు. ఏంజెల్‌ వన్‌ సెపె్టంబర్‌ త్రైమాసికంలో 42 శాతం అధికంగా రూ.305 కోట్ల లాభాన్ని సొంతం చేసుకుంది. ఒకే త్రైమాసికంలో అత్యధికంగా 21 లక్షల మంది క్లయింట్లకు పెంచుకుంది. ఎంకే గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ లాభం సైతం 52 శాతం పెరిగింది.

Videos

విశాఖకే జై కొట్టిన టిడిపి

Watch Live: కర్నూలులో సీఎం జగన్ ప్రచార సభ

అంతా మాయ..సేమ్ 2 సేమ్.. 2024 మోదీ ఎన్నికల స్పీచ్ పై డిబేట్

కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం

ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం

పచ్చ మద్యం స్వాధీనం..

బాబును నమ్మే ప్రసక్తే లేదు..

మహిళలపైనా పచ్చమూకల దాష్టీకం..

నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

విజనరీ ముసుగేసుకున్న అవినీతి అనకొండ

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)