amp pages | Sakshi

కార్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్లు, రైతులకు అదనంగా!

Published on Wed, 01/12/2022 - 13:36

కార్ల కొనుగోలు దారులకు బంపర్‌ ఆఫర్‌. మన దేశంలో ఫెస్టివల్‌ సీజన్‌ సందర్భంగా ఫ్రాన్స్‌ కార్ల కంపెనీ రెనాల్ట్‌' రెనాల్ట్‌ ఇండియా' కార్ల కొనుగోలు దారులకు కళ్లు చెదిరేలా డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. 

జనవరి ఫెస్టివల్‌ సీజన్‌ సందర్భంగా రెనాల్ట్‌ ఇండియా పలు కార్లపై భారీ డిస్కౌంట్‌ అందిస్తుంది. డిస్కౌంట్‌తో పాటు ఎక్ఛేంజ్‌ ఆఫర్‌ను పొందవచ్చు. ఇక రెనాల్ట్‌ ఇండియా కార్లపై డిస్కౌంట్స్‌ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.    

రెనాల్ట్ క్విడ్
రెనాల్ట్ క్విడ్ రెండు వెర్షన్ల కారు కొనుగోలు దారులు డిస్కౌంట్‌తో పాటు ఎక్ఛేంజ్‌ ఆఫర్‌ను పొందవచ్చు. మోడల్ 1.0-లీటరు వెర్షన్‌ కారు కొనుగోలుపై రూ 5,000 మై 2022 మోడళ్ల (08.లీటర్ వెర్షన్లు తప్ప)పై రూ 10,000 డిస్కౌంట్‌తో పాటు అదనంగా రూ.15,000 వరకు ఎక్ఛేంజ్ బోనస్‌ను దక్కించుకోవచ్చు.కార్పొరేట్, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 10,000, రూ. 5,000 డిస్కౌంట్‌ లభిస్తుంది. ఆర్‌ఎక్స్‌ఈ 0.8 లీటర్ వేరియంట్ పై రూ.10,000 లాయల్టీ ప్రయోజనాల్ని పొందవచ్చు. 

రెనాల్ట్ కిగర్
రెనాల్ట్ కిగర్ కారు కొనుగోలు దారులకు లాయల్టీ బెన్‌ఫిట్‌ కింద రూ.10వేల వరకు తగ్గింపు పొందవచ్చు.దీంతో పాటు కార్పొరేట్ డిస్కౌంట్, గ్రామీణ ప్రాంతాల్లో ఈ కారు కొనుగోలు దారులకు రూ.10,000, రూ.5,000 డిస్కౌంట్ పొందవచ్చు. 

రెనాల్ట్‌ ట్రైబర్
రెనాల్ట్‌ ట్రైబర్ కొనుగోలు దారులు ఎంవై 2021 మోడల్‌పై రూ. 10,000 (ఆర్‌ఎక్స్‌ఈ వేరియంట్ మినహా) డిస్కౌంట్‌, ఎక్ఛేంజ్‌ కింద రూ.20,000 వరకు ఆఫర్‌ను సొంతం చేసుకోవచ్చు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో  ఆర్‌ఎక్స్‌ఈ వేరియంట్‌పై లాయల్టీ బోనస్ రూ.10,000, రైతులు, సర్పంచ్, గ్రామ పంచాయితీ సభ్యులకు రూ.5,000 డిస్కౌంట్‌ ఆఫర్ అందుబాటులో ఉంది. సెలక్ట్‌  చేసిన వేరియంట్‌లపై కార్పొరేటర్లు,పీఎస్‌యూల(ప్రభుత్వ ఉద్యోగస్తులకు) రూ.10,000 వరకు కార్పొరేట్ తగ్గింపును కూడా ఎంచుకోవచ్చు

రెనాల్ట్ డస్టర్
రెనాల్ట్ డస్టర్ అన్ని వేరియంట్లపై (ఆర్‌ఎక్స్‌ జెడ్‌1.5 ట్రిమ్ మినహా) రూ.50,000 ఎక్ఛేంజ్‌ ఆఫర్‌, రూ.50,000 డిస్కౌంట్‌ పొందవచ్చు. కార్పొరేట్, ప్రభుత్వ ఉద్యోగులకు ఎంపిక చేసిన వేరియంట్లలో రూ.30,000, గ్రామీణ ప్రాంతాల కొనుగోలు దారులు రూ.15,000 వరకు సొంతం చేసుకోవచ్చు.

చదవండి: బంపరాఫర్‌..! మహీంద్రా కార్లపై రూ. 82 వేల వరకు భారీ తగ్గింపు.! 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌