amp pages | Sakshi

4జీ స్పీడ్‌, మరోసారి టాప్‌లో జియో

Published on Thu, 11/17/2022 - 18:16

న్యూఢిల్లీ: అతి వేగవంతమైన 5 జీ నెట్‌ వర్క్‌ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియో మరోసారి తన సత్తా చాటుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) అక్టోబరు 4జీ స్పీడ్ టెస్ట్ గణాంకాలను విడుదల చేసింది. జియో సగటు 4G డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.  ట్రాయ్‌ విడుదల చేసిన డేటా ప్రకారం, జియో సగటు 4G డౌన్‌లోడ్ వేగం సెప్టెంబర్‌లో 19.1 Mbps నుండి అక్టోబర్‌లో 20.3 Mbpsకి పెరిగింది. (మస్క్‌ మరో బాంబు: వన్‌ అండ్‌ ఓన్లీ అప్షన్‌, డెడ్‌లైన్‌)

సగటు డౌన్‌లోడ్ స్పీడ్ విషయంలో   ఎయిర్టెల్‌, వోడాఫోన్‌ ఐడియా మధ్య గట్టి  నెలకొంది. అక్టోబర్‌లో ఎయిర్‌టెల్ సగటు 4జీ డౌన్‌లోడ్ వేగం 15 Mbps కాగా Vi (వోడాఫోన్-ఐడియా) 14.5 Mbps. కానీ  ఎయిర్టెల్‌, వోడాఫోన్‌ ఐడియాతో పోలిస్తే జియో 4జీ సగటు  డౌన్‌లోడ్ వేగం 5 Mbps ఎక్కువ. (త్వరలోనే తప్పుకుంటా, అమెరికా కోర్టులో మస్క్‌ సంచలన ప్రకటన)

సగటు 4G అప్‌లోడ్ వేగం పరంగా కూడా, రిలయన్స్ జియో గత నెలలో మొదటి సారి తొలి స్థానానికి చేరుకుంది. అక్టోబర్ నెలలో కూడా కంపెనీ తన స్థానాన్ని నిలబెట్టుకుంది.  6.2 Mbps సగటు 4G అప్‌లోడ్ వేగంతో జియో టాప్ లో నిలిచింది. వోడాఫోన్-ఐడియా 4.5 Mbps వేగంతో రెండవ స్థానంలో కొనసాగింది. అదే సమయంలో, ఎయిర్‌టెల్ అప్‌లోడ్ స్పీడ్‌లో నిరంతర క్షీణత ఉంది. అక్టోబర్‌లో ఎయిర్‌టెల్ సగటు 4జీ అప్‌లోడ్ వేగం ఆందోళనకరంగా 2.7 Mbpsకి చేరుకుంది. ఎయిర్‌టెల్ అప్‌లోడ్ వేగం జియోలో సగం కంటే తక్కువకు చేరుకుంది.

Videos

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ

రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్

బాబు, లోకేష్ కు నోటీసులు..?

ప్రచారంలో దూసుకుపోతున్న జగన్

జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌