amp pages | Sakshi

భారత్‌లో రీ ఎంట్రీకి పబ్‌జీ మాస్టర్‌ ప్లాన్‌

Published on Wed, 09/09/2020 - 15:53

భారత్‌లో మరోసారి అడుగుపెట్టేందుకు పబ్‌జీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. పబ్‌జీకి అతిపెద్ద మార్కెట్‌ అయిన భారత్‌లో ఈ యాప్‌ను బ్యాన్‌ చేయడంతో పబ్‌జీ డెవలపర్ప్‌ఆర్థికంగా భారీ నష్టాలు చవిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా స్టేక్‌ హోల్డర్స్‌కు బై చెప్పి ఇండియన్‌ గేమింగ్‌ దిగ్గజంతో చేతులు కలిపితే తమకు పూర్వ వైభవం ఖాయమన్నది వారి అంచనా. ఈ దిశగా చర్చలు కూడా పూర్తయ్యాయని కొన్ని జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. తమ చర్చలు సఫలమైతే భారత్‌లో పబ్‌జీపై బ్యాన్‌ లిఫ్ట్‌ చేస్తారని ‘బ్లూహోల్‌‌’గట్టిగా నమ్ముతోంది. చైనా సంస్థలకు భాగస్వామ్యం ఉండడంతోపాటు యూజర్ల డేటా ప్రమాదంలో పడిందని, వీటన్నింటితోపాటు మరికొన్ని కారణాల వల్ల ఈ యాప్‌ను భారత్‌లో బ్యాన్‌ చేశారని ఇక్కడి అధికారులు చెబుతున్నారు.

మెజారిటీ షేర్‌ హోల్డర్‌ ఎవరంటే..
పబ్‌జీలో ప్రధాన వాటా దక్షిణ కొరియాకు చెందిన ‘బ్లూహోల్‌ గేమ్స్‌’ వద్ద ఉంది. చైనాకు చెందిన ‘టెన్సెంట్‌ గేమ్స్‌’తో పార్ట్‌నర్‌షిప్‌ టైఅప్‌ చేసుకున్న ‘బ్లూహోల్‌’.. ప్రపంచ వ్యాప్తంగా తమ గేమింగ్‌ యాప్‌ను లాంచ్‌ చేసింది. ‘దేశ ప్రయోజనాల’ను  కాపాడడంలో భాగంగా దాదాపు వందకు పైగా చైనా యాప్ప్‌ను ఇటీవల భారత్‌ బ్యాన్‌ చేసింది. ఇందులో పబ్‌జీ ప్రధానమైంది. కోట్ల సంఖ్యలో ఇండియన్స్‌ ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. 2019లో భారత్‌ ద్వారా దాదాపు 100 మిలియన్‌ డాలర్లు ‘బ్లూహోల్‌’ ఖాతాలో పడినట్టు తెలుస్తోంది. 

పబ్‌జీ మేనేజ్‌మెంట్‌ ఆలోచన ఇదే..
చైనాకు చెందిన ‘టెన్సెంట్‌ గేమ్స్‌’కు కటీఫ్‌ చెబితే భారత్‌లో రీ ఎంట్రీ ఇవ్వొచ్చన్నది ‘బ్లూహోల్‌ గేమ్స్‌’ ఐడియా. ఇందులో భాగంగానే వీలైనంత త్వరగా భారత్‌కు చెందిన గేమింగ్‌ యాప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇప్పటికే కొన్ని గేమింగ్‌ యాప్‌ డెవలపర్లతో చర్చలు కూడా పూర్తయ్యాయని కొన్ని జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఈ చర్చలు సఫలమైతే భారత్‌లో పబ్‌జీపై బ్యాన్‌ లిఫ్ట్‌ చేస్తారని ‘బ్లూహోల్‌‌’ గట్టిగా నమ్ముతోంది. 

భారత అధికారులేమంటున్నారంటే..
‘బ్లూహోల్‌‌’ ప్రయత్నాలపై భారత అధికారుల వాదన మరోలా ఉంది. పబ్‌జీలో చైనా సంస్థలకు భాగస్వామ్యం ఉండడంతోపాటు ఇక్కడి యూజర్ల డేటా ప్రైవసీ ప్రమాదంలో పడిందన్నది వారి అనుమానం. వీటన్నింటితోపాటు మరికొన్ని కారణాల వల్ల ఈ యాప్‌ను భారత్‌లో బ్యాన్‌ చేశారని అధికారులు చెబుతున్నారు. ఈ యాప్‌ను బ్యాన్‌ చేసిన వెంటనే.. డేటా ప్రైసీకి సంబంధించిన తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందిగా పబ్‌జీ మేనేజ్‌మెంట్‌ను భారత్‌ ప్రభుత్వం కోరిందని.. ఇందుకు మూడు వారాలు గడువిచ్చిందని అధికారులు వివరిస్తున్నారు. 

ఆ సంస్థకే ఛాన్స్‌?
పబ్‌జీ వంటి ‘భారీ’ యాప్ప్‌ను మేనేజ్‌ చేసే సత్తా భారత్‌లో అతికొన్ని సంస్థలకే ఉందని ఇక్కడి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పబ్‌జీకి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న ‘గరేనా ఫ్రీఫైర్‌’తో ఇప్పటికే టైఅప్‌ అయిన‘పేటీఎం ఫస్ట్‌ గేమ్స్‌’ వంటి ఒకట్రెండు సంస్థలకే ఈ కెపాసిటీ ఉందని చెబుతున్నారు. భారత్‌లో పబ్‌జీ లైసెన్స్‌ను పొందేందుకు బిగ్‌ షాట్‌ రిలయన్స్‌ ఇప్పటికే రంగంలోకి దిగిందని వార్తలొచ్చినప్పటికీ ఆ సంస్థ వీటిపై నోరు మెదపలేదు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)