amp pages | Sakshi

పీనోట్ల పెట్టుబడులు డీలా..

Published on Mon, 06/27/2022 - 06:10

న్యూఢిల్లీ: పార్టిసిపేటరీ(పీ) నోట్ల ద్వారా దేశీ క్యాపిటల్‌ మార్కెట్లలో పెట్టుబడులు మే నెలలో వెనకడుగు వేశాయి. రూ. 86,706 కోట్లకు పరిమితమయ్యాయి. అంతకుముందు నెల అంటే 2022 ఏప్రిల్‌లో ఇవి రూ. 90,580 కోట్లుగా నమోదయ్యాయి. క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల ప్రకారం ఈక్విటీ, రుణ సెక్యూరిటీలు, హైబ్రిడ్‌ సెక్యూరిటీల నుంచి గత నెలలో దాదాపు రూ. 4,000 కోట్ల పీనోట్‌ పెట్టుబడులు వెనక్కి మళ్లాయి.

దేశీయంగా రిజిస్టరైన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) పీనోట్లను జారీ చేస్తుంటారు. వీటి ద్వారా విభిన్న విదేశీ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు రిజిస్ట్రేషన్‌ లేకుండానే దేశీయంగా ఇన్వెస్ట్‌ చేసేందుకు వీలుంటుంది. అయితే రానున్న మూడు నుంచి ఆరు నెలల్లో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాట వీడి దేశీ స్టాక్స్‌లో తిరిగి పెట్టుబడులు చేపట్టే వీలున్నట్లు మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు.  

ఈక్విటీలకే అధికం
ఈ ఏడాది(2022) మార్చికల్లా పీనోట్‌ పెట్టుబడులు రూ. 87,979 కోట్లకు చేరగా.. ఫిబ్రవరిలో ఇవి రూ. 89,143 కోట్లు, జనవరిలో రూ. 87,989 కోట్లను తాకాయి. గత నెల పెట్టుబడుల్లో రూ. 77,402 కోట్లు ఈక్విటీలలో, రూ. 9,209 కోట్లు రుణ సెక్యూరిటీలలో, మరో రూ. 101 కోట్లు హైబ్రిడ్‌ సెక్యూరిటీలలోనూ నమోదయ్యాయి. అయితే ఏప్రిల్‌ పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా రూ. 81,571 కోట్లుకాగా.. రూ. 8,889 కోట్లు రుణ సెక్యూరిటీలకు మళ్లాయి.

పదేళ్ల కాలపు ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్‌ బలపడుతుండటంతో ఇటీవల ఈక్విటీల నుంచి పెట్టుబడులు వెనక్కి మళ్లుతున్నట్లు గ్రీన్‌ పోర్ట్‌ఫోలియో వ్యవస్థాపకుడు దివమ్‌ శర్మ పేర్కొన్నారు. పీనోట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ నీరసించిన నేపథ్యంలో ఎఫ్‌పీఐల కస్టడీలో ఉన్న ఆస్తుల(పెట్టుబడులు) విలువ సైతం మే నెలలో 5 శాతం క్షీణించి రూ. 48.23 లక్షల కోట్లకు చేరింది. ఏప్రిల్‌ చివరికల్లా ఈ విలువ రూ. 50.74 లక్షల కోట్లను తాకింది. గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి రూ. 40,000 కోట్లు, రుణ మార్కెట్ల నుంచి రూ. 5,505 కోట్ల పెట్టుబడులు వాపస్‌ తీసుకోవడం గమనార్హం! 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌