amp pages | Sakshi

ఆపిల్, గూగుల్ కంపెనీలకు భారీ షాక్

Published on Wed, 12/23/2020 - 19:39

న్యూఢిల్లీ: ఆపిల్, గూగుల్, డ్రాప్‌బాక్స్ వంటి క్లౌడ్ స్టోరేజ్ కంపెనీలకు నీతి ఆయోగ్ భారీ షాక్ ఇచ్చింది. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా డీజీబాక్స్(Digi Boxx)అనే స్వదేశీ క్లౌడ్ స్టోరేజ్, మేనేజ్మెంట్ ప్లాట్‌ఫాంను ప్రారంభించింది. దీనికోసం డీజీబాక్స్ బృందంతో కలిసి పనిచేసినట్లు నీతి ఆయోగ్ సిఇఓ అమితాబ్ కాంత్ తెలిపారు. ఇందులో రా ఫైల్స్, ఫోటోలు, ఈ-డాక్యుమెంట్స్ వంట వాటిని నిల్వచేసుకోవచ్చు. ఈ సేవలు వెబ్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని త్వరలో ఐఓఎస్ వెర్షన్ యూజర్లకు కూడా అందుబాటులో ఉంటుందని బృందం తెలిపింది.

డీజీబాక్స్ లో ఆన్-డిమాండ్, రియల్ టైమ్ యాక్సెస్, ఎడిటింగ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా ఇందులో ఫైల్స్ లేదా డేటాని ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు మీ మొబైల్ లేదా లాప్టాప్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న మెటాడేటా ఫీచర్ ఆధారంగా డేటాను సులభంగా సెర్చ్ చేసుకోవచ్చు. ఇందులో వేర్వేరు ఫార్మాట్, సైజులలో ఉన్న డాక్యుమెంట్స్ ఒకేసారి అప్లోడ్ చేయవచ్చు. ఇందులో ఉన్న ఫిల్టర్స్ ఫీచర్ ద్వారా ఫైల్స్‌ను వేర్వేరు విభాగాలుగా విభజించడం, లేబుల్స్ క్రియేట్ చేయడం, ముఖ్యమైన ఫైల్స్‌ను టాప్‌లో ఉండేటట్లు కూడా చేసుకోవచ్చు. 

డీజీబాక్స్ ఎలా ఉపయోగించాలి?
డీజీబాక్స్ క్లౌడ్ స్టోరేజ్  సేవలను ఉపయోగించడానికి వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఖాతా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీ పేరు, ఇమెయిల్ చిరునామా, ఫోన్ నంబర్, నివాస చిరునామా వంటి వాటిని నమోదు చేయాల్సి ఉంటుంది. తరువాత డీజీబాక్స్ వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మీ స్వంత ఫైల్‌లను సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ ఫైల్స్ ను ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు. ఫైల్‌లను వెంటనే షేర్ చేయడానికి మీ మెయిల్, రిసీవర్ యొక్క మెయిల్ అందించాల్సి ఉంటుంది. ఇప్పుడు 2జీబీ ఫైల్స్ వరకు షేర్ చేయవచ్చు. ఈ ఫైల్‌లు 45 రోజుల పాటు డిజిబాక్స్‌లో ఉంటాయి.
   
డీజీబాక్స్ ధర
ఈ సేవలు పొందటం కోసం డీజీబాక్స్ యొక్క నెల, వార్షిక ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. దీన్ని ఉచితంగా పొందడానికి కూడా 20జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఎస్ఎస్ఎల్ సెక్యూరిటీ, జీమెయిల్ ఇంటిగ్రేషన్ వంటి ఫీచర్లు కూడా లభించనున్నాయి. ఫ్రీ యూజర్లు 2జీబీ సైజు ఉన్న ఫైల్స్ ఒకేసారి షేర్ చేసుకోవచ్చు. అదే నెలకు రూ.30 రూపాయలు చెల్లిస్తే 5టీబీ స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది. వీరు 10 జీబీ సైజ్ ఉన్న ఫైల్స్ కూడా ఒకేసారి అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే చిన్న, మధ్యతరహా వ్యాపారుల కోసం నెలకు రూ.999 ప్లాన్ ను అందుబాటులో ఉంచింది. ఈ ఫైల్స్ ను 500 వినియోగదారులు వాడుకోవచ్చు. ఇందులో 50టీబీ స్పేస్ లభిస్తుంది. వీరు కూడా ఒఒకేసారి 10 జీబీ సైజ్ ఉన్న ఫైల్స్ అప్లోడ్ చేసుకోవచ్చు.     

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)