amp pages | Sakshi

అక్టోబర్ 1 నుంచి ఆర్​బీఐ కొత్త ఆటో డెబిట్ రూల్స్

Published on Mon, 09/20/2021 - 20:42

ప్రస్తుత ప్రపంచం మొత్తం డిజిటల్ గా మారింది. బ్యాంకుకు వెల్లకుండానే చెల్లింపులు క్షణాలలో జరిగిపోతున్నాయి. చాలా మంది కరెంట్​ బిల్​, టీవీ బిల్లు, ఓటీటీ సబ్​స్క్రిప్షన్​ బిల్లు, ఇతర ఈఎంఐల వంటి వాటికి ఆటో డెబిట్ అనే​​ సదుపాయం వినియోగించుకుంటున్నారు. ఈ ఆటో డెబిట్​​ సదుపాయం వల్ల ఏదైనా బిల్లు గడువు తేదీ మరిచిపోయినా ఆటో మెటిక్ గా సరైనా సమయానికి చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్​బీఐ) ఈ ఆటో డెబిట్ లావాదేవీల్లో కొన్ని మార్పుల చేసింది.

ఆటో డెబిట్ లావాదేవిలకు సంబంధించి కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుండి అమల్లోకి రానున్నాయి. అక్టోబర్ 1 నుంచి ఆటో డెబిట్ అనే​​ సదుపాయం ఉపయోగించుకోవడం అంత సులభం కాదు. కొత్త నిబందనల ప్రకారం.. క్రెడిట్​, డెబిట్​ కార్డుల ద్వారా ఆటో డెబిట్​ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే.. ఆ పేమెంట్​కు ఓటీపీ అదనపు ధ్రువీకరణ(ఏఎఫ్‌ఏ) అవసరం. రూ.5000 కంటే ఎక్కువ మొత్తానికి ఆటో డెబిట్​ సదుపాయాన్ని వాడుకోవాలంటే ఓటీపీ అదనపు ధ్రువీకరణ(ఏఎఫ్‌ఏ) అవసరమవుతుంది. ఆటో డెబిట్​ తేదీకి కొన్ని రోజుల ముందే లవదేవికి సంబంధించిన సమాచారాన్ని వినియోగదారుడికి బ్యాంకులు పంపిస్తాయి. (చదవండి: లోన్ తీసుకునేవారికి బ్యాంకులు బంపర్ ఆఫర్స్!)

ఆ తర్వాత పేమెంట్​ కొనసాగించాలనుకుంటే ఓటీపీతో ఆ పేమెంట్​ను నిర్ధరించాలి. లేదంటే పేమెంట్​ పూర్తవదు. అప్పుడు మాన్యువల్​గా లావాదేవీని పూర్తి చేయాల్సి ఉంటుంది. అన్ని రకాల క్రెడిట్​, డెబిట్​ కార్డులకు దేశీయ, అంతర్జాతీయ లావాదేవీలకు ఈ రూల్స్​ వర్తిస్తాయి. ఈ కొత్త నిబంధనలు 2021 ఏప్రిల్ నుంచి అమలులోకి రావాల్సి ఉండేది. కానీ, బ్యాంకుల అభ్యర్ధన మేరకు ఆరు నెలలు వాయిదా వేసింది. గడువు తర్వాత ఆర్​బీఐ పేర్కొన్న విధంగా నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకొనున్నట్లు కూడా స్పష్టం చేసింది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌