amp pages | Sakshi

ఈ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌.. భల్లేభల్లే 

Published on Fri, 10/09/2020 - 14:42

తొలుత కనిపించిన ఆటుపోట్ల నుంచి బయటపడుతూ జోరందుకున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 302 పాయింట్లు జంప్‌చేసి 40,485ను తాకగా.. నిఫ్టీ 74 పాయింట్లు ఎగసి 11,908 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం పెరిగింది. జాబితాలో రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఎస్‌హెచ్‌ కేల్కర్‌ అండ్‌ కంపెనీ, జీఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, వేలియంట్‌ ఆర్గానిక్స్‌ చోటు సాధించాయి. ట్రేడింగ్‌ వివరాలు చూద్దాం..

రెప్కో హోమ్‌ ఫైనాన్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 5 శాతం లాభపడి రూ. 209 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 219 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 73,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.1 లక్షల షేర్లు చేతులు మారాయి.

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 6.4 శాతం జంప్‌చేసి రూ. 305 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 318 వరకూ లాభపడింది. బీఎస్‌ఈలో  గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 1.61 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 7.04 లక్షల షేర్లు చేతులు మారాయి.

ఎస్‌హెచ్‌ కేల్కర్‌ అండ్‌ కంపెనీ
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 11 శాతం ర్యాలీ చేసి రూ. 95 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 40,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.31 లక్షల షేర్లు చేతులు మారాయి.

జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 5.3 శాతం జంప్‌చేసి రూ. 107 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 112 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 62,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 2.27 లక్షల షేర్లు చేతులు మారాయి.

వేలియంట్‌ ఆర్గానిక్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 15.4 శాతం దూసుకెళ్లి రూ. 3,398 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 3,488 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 46,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 30,500 షేర్లు చేతులు మారాయి.

Videos

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ

రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్

బాబు, లోకేష్ కు నోటీసులు..?

ప్రచారంలో దూసుకుపోతున్న జగన్

జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌