amp pages | Sakshi

జీప్ రాంగ్లర్ ఎస్‌యూ‌వి వెహికల్ కొనేవారికి షాక్!

Published on Mon, 10/11/2021 - 18:40

మీరు కొత్తగా జీప్ రాంగ్లర్ ఎస్‌యూ‌వి కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక చేదువార్త. జీప్ ఇండియా గత వారం కంపాస్ ధరలను భారీగా పెంచగా, ఈ సారి రాంగ్లర్ ధరలను గణనీయంగా పెంచింది. ఈ ఏడాది మార్చిలో జీప్ ఇండియా భారతదేశంలో రాంగ్లర్ ఎస్‌యూ‌విని అసెంబుల్ చేయడం ప్రారంభించింది. కంపెనీ ప్రస్తుతం కంపాస్, రాంగ్లర్ వాహనాలను పూణేలోని రంజన్ గావ్ ఫెసిలిటీలో తయారు చేస్తుంది. ఇది ప్రపంచ మార్కెట్లకు ఉత్పత్తి, ఎగుమతి కేంద్రంగా ఉంది. అన్ లిమిటెడ్, రూబికాన్ అనే రెండు వేరియెంట్లలో రాంగ్లర్ మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ రెండు వేరియెంట్ల ధరలు రూ.1,25,000 పెరిగాయి. 

అన్ లిమిటెడ్ ధర ఇప్పుడు రూ.55.15 లక్షలు కాగా, రూబికాన్ రూ.59.15 లక్షలుగా దేశంలో ఇంతకు ముందు అమ్మకానికి వచ్చిన సీబియు వెర్షన్ కంటే రాంగ్లర్ సుమారు రూ.10 లక్షలు చౌక. మనదేశంలో అసెంబుల్ చేసిన ఈ జీప్ రాంగ్లర్ ఎస్‌యూ‌వి 5-డోర్ వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. దీనికి పాత మోడల్ లాగానే  2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ అమర్చారు. ఈ ఇంజన్ గరిష్టంగా 268 హెచ్‌పి శక్తిని, 400 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్టాండర్డ్ గా వస్తుంది. (చదవండి: ఎలాన్‌ మస్క్‌, జెఫ్‌బెజోస్‌: వీళ్లిద్దరూ ఏక్‌ నెంబర్‌ 'పిసినారులు')

ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్స్, లెదర్ అప్హోల్స్టరీ, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో 7.0-ఇంచ్ కలర్ ఎంఐడి స్క్రీన్, ఆపిల్ కార్ ప్లే, 8.4-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ / స్టార్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రాంగ్లర్ ఎస్‌యూవీ కావడంతో రిమువబుల్ డోర్స్, హార్డ్ టాప్ పైకప్పు ఉంటుంది. జీప్ రాంగ్లర్ లో ఫ్రంట్ అండ్ సైడ్ ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ రోల్ మిటిగేషన్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, టైర్ ప్రెజర్ మానిటర్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, కెమెరా  స్టాండర్డ్ సేఫ్టీ పరంగా అందిస్తుంది.

 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌