amp pages | Sakshi

2022లో రాకెట్‌ ప్రయోగం! దూసుకుపోతున్న హైదరాబాద్‌ స్టార్టప్‌

Published on Thu, 01/27/2022 - 18:30

టెక్నాలజీలో బెంగళూరుతో పోటీ పడేందుకు హైదరాబాద్‌ రెడీ అవుతోంది. స్టార్టప్  కల్చర్‌ నగరంలో వేళ్లూనుకుంటోంది. నగరం నుంచి ఫస్ట్‌ స్టార్టప్‌ యూనికార్న్‌ వచ్చిన మరుసటి రోజే మరో తీపి కబురు అందింది. 

నిధుల సమీకరణ
ఎయిరోస్పేస్‌ టెక్నాలజీపై హైదరాబాద్‌ కేంద్రంగా స్కైరూట్‌ స్టార్టప్‌ పని చేస్తోంది. గడిచిన 18 నెలల కాలంలో విక్రమ్‌ స్పేస్‌ లాంచ్‌ సిరీస్‌లో ప్రొపల్షన్‌ టెక్నాలజీని మరింతగా అభివృద్ధి చేశారు. ఇక పూర్తి స్థాయి ఫలితాలుకు కొద్ది దూరంలో ఈ స్టార​‍్టప్‌ ఉంది. కాగా ఈ స్టార్టప్‌ వెంచర్‌ క్యాపిటలిస్టులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఫండ్‌ రైజింగ్‌లో భాగంగా సిరీస్‌ బీలో స్కైరూట్‌ 4.5 మిలియన్‌ డాలర్ల పెట్టుబడిని సమీకరించింది. అంతకు ముందు సిరీస్‌ ఏలో 11 మిలియన్‌ డాలర్ల వరకు పెట్టుబడిని తేగలిగింది. ఇప్పటి వరకు స్కైరూట్‌లో వెంచర్‌ క్యాపిటలిస్టులు 17 మిలియన్‌ డాలర్ల (రూ. 127 కోట్లు) వరకు పెట్టుబడులు పెట్టారు.

2022లో రాకెట్‌ ప్రయోగం
నిధుల సమీకరణ బాగుండటంతో రాకెట్‌ లాంఛింగ్‌కి అవసరమైన ‘క్రిటిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌’ పనులు శరవేగంగా చేసుకుంటూ పోతోంది స్కూరూట్‌.  2022లోనే  స్కైరూట్‌ విక్రమ్‌ రాకెట్‌ను ప్రయోగించాలనే లక్ష్యంతో పని చేస్తోంది. రాకెట్‌ టెక్నాలజీ ఇన్‌ఫ్రా విషయంలో ఇస్రో, స్కూరూట్‌ల మధ్య ఎంఓయూ ఉంది. 

సీన్‌ మారుతోంది
హురున్‌ ఇండియా ఇటీవల వెల్లడించిన స్టార్టప్‌ జాబితాలో హైదరాబాద్‌ పెద్ద పీట దక్కలేదు.  కొత్తగా వస్తున్న స్టార్టప్‌లు, స్టార్టప్‌లన ఉంచి యూనికార్న్‌గా ఎదుగుతున్న సంస్థలు ఎక్కువగా బెంగళూరు, ముంబై, ఢిల్లీల నుంచే ఎక్కువగా వస్తున్నాయి. కానీ రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ పరిస్థితి మెరుగుపడవచ్చనే  నమ్మకాన్ని రోజురోజుకు సానుకూల ఫలితాలు ప్రకటిస్తున్న స్టార్టప్‌లు కల్పిస్తున్నాయి. హైదరాబాద్‌ కేంద్రంగా ఎయిరోస్పేస్‌ టెక్నాలజీ  కొత్త రూపు తీసుకోబోతోంది. ఇక్కడ నెలకొల్పిన స్టార్టప్‌ కంపెనీలపై వెంచర్‌ క్యాపిటలిస్టులు నమ్మకం చూపించడం ఈ నమ్మకాన్ని బలపరుస్తోంది.

చదవండి:యూనికార్న్‌ కంపెనీగా అవతరించిన హైదరాబాద్ కంపెనీ.. కేటీఆర్ అభినందనలు!

Videos

అమెరికాలో ప్రమాదంలో ప్రాణాలు విడిచిన తెలంగాణ యువకుడు

చంద్రబాబుకి బయపడి గుళ్లలో తలా దాచుకుంటున్నారు..

తాడిపత్రి హింసాత్మక ఘటనల వెనుక అసలు హస్తం

కుప్పం నుండి ఇచ్చాపురం వరకు అందుకే పోలింగ్ శాతం పెరిగింది

పోలీసులు ఏ రాజకీయ పార్టీల ప్రలోభాలకు లోను కాకుండా నిస్పక్షపాతంగా పనిచెయ్యాలి

ఏపీ ఎన్నికల అల్లర్ల పై సిట్ విచారణ.. ఇప్పటికే పోలీసుల ఫై వేటు

మోడీపై పోటీ చేస్తున్న శ్యామ్ కు షాక్..

మాట నిలబెట్టుకునే మా అన్నకు మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి

అచ్చెన్నాయుడు రిగ్గింగ్.. అడ్డుకున్న వారిపై దాడి

ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతి

Photos

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)