amp pages | Sakshi

తెలంగాణను దాటేసిన ఏపీ..!

Published on Mon, 12/04/2023 - 16:52

దేశంలో మరోసారి భారీగా జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. నవంబరు నెలలో జీఎస్‌టీ వసూళ్లు ఆంధ్రప్రదేశ్‌లో 31%, తెలంగాణలో 18% వృద్ధి నమోదు చేశాయి. కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసిన నవంబరు నెల లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ వసూళ్లు గతేడాది నవంబరుతో పోలిస్తే ఈ నవంబరులో రూ.3,134 కోట్ల నుంచి రూ.4,093 కోట్లకు పెరిగాయి. 

ఈ నెలలో దేశవ్యాప్తంగా రూ.1,67,929 కోట్లు వసూలయ్యాయి. ఇందులో సీజీఎస్టీ వాటా రూ.30,420 కోట్లు, ఎస్‌జీఎస్టీ వాటా రూ.38,226 కోట్లు. ఐజీఎస్టీ రూపంలో రూ.87,009 కోట్ల సమకూరగా.. సెస్సుల రూపంలో రూ.12,274 కోట్లు వచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల తెలిపింది.

ఐజీఎస్టీ రూపంలో వచ్చిన వసూళ్లను రూ.37,878 కోట్లు సీజీఎస్టీకి, రూ.31,557 కోట్లు ఎస్‌జీఎస్టీ కింద సర్దుబాటు చేసింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు 15 శాతం పెరిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది ఆరోసారి. రాష్ట్రాల వారీగా రూ.25,585 కోట్లతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్‌లో రూ.4,093 కోట్లు వసూళ్లు జరిగాయి. గతేడాది రూ.3,134 కోట్లతో పోలిస్తే 31 శాతం అధికం. తెలంగాణలో గతేడాది రూ.4,228 కోట్లు వసూళ్లు ఈ సారి 18 శాతం వృద్ధితో రూ.4,986 కోట్లు వసూళ్లు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: ప్రపంచంలోనే నాసా కంటే ఎక్కువ డేటా ట్రాన్స్‌ఫర్‌..! కానీ..

ఎస్‌జీఎస్‌టీని కేంద్ర, రాష్ట్రాల మధ్య పంపిణీ చేసిన తర్వాత ఏప్రిల్‌-నవంబరు మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన వాటా 2022తో (రూ.18,742కోట్లు) పోలిస్తే 2023లో (రూ.20,952కోట్లు) 12% పెరిగింది. తెలంగాణకు దక్కిన వాటా రూ.24,460 కోట్ల నుంచి రూ.26,691 కోట్లకు (9%) పెరిగింది. ఎస్‌జీఎస్‌టీ వాటా అన్ని రాష్ట్రాలకూ సగటున 12% వృద్ధి చెందింది.

Videos

సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)

కొడాలి నాని మనసున్న రాజు గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా

బాహుబలి పట్టాభిషేకం సీన్ తలపించిన సీఎం జగన్ సభ

చంద్రబాబు పై గాడిద సామెత

"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

రైతులను ఉద్దేశించి సీఎం జగన్ అద్భుత ప్రసంగం

సీఎం జగన్ మాస్ స్పీచ్ దద్దరిల్లిన కళ్యాణ దుర్గం

జనాన్ని చూసి సంభ్రమాశ్చర్యానికి లోనైనా సీఎం జగన్

Photos

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)