amp pages | Sakshi

రూ. 8.56 లక్షల కోట్లు.. 2,220 లావాదేవీలు..

Published on Sat, 01/08/2022 - 11:13

ముంబై: గత కేలండర్‌ ఏడాది(2021) డీల్స్‌పరంగా అత్యుత్తమమని కన్సల్టింగ్, అడ్వయిజరీ సంస్థ గ్రాంట్‌ థార్న్‌టన్‌ రూపొందించిన నివేదిక పేర్కొంది. మొత్తం 2,224 లావాదేవీలు నమోదుకాగా.. 2020లో జరిగిన లావాదేవీలతో పోలిస్తే 867 అధికమని తెలియజేసింది. ఇక వీటి విలువ సైతం 37 బిలియన్‌ డాలర్లు అధికంగా 115 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు తెలియజేసింది. వెరసి అటు డీల్స్, ఇటు విలువపరంగా రికార్డ్‌ నమోదైనట్లు నివేదిక తెలియజేసింది. వీటిలో 42.9 బిలియన్‌ డాలర్ల విలువైన 499 లావాదేవీలు విలీనాలు, కొనుగోళ్లు జరిగినట్లు వెల్లడించింది.

ఈకామర్స్‌ స్పీడ్‌
గతేడాది 48.2 బిలియన్‌ డాలర్ల విలువైన 1,624 ప్రయివేట్‌ ఈక్విటీ డీల్స్‌ జరిగాయి. 101 ఐపీవోలు, క్విప్‌ల ద్వారా 23.9 బిలియన్‌ డాలర్ల లావాదేవీలు నమోదుకాగా.. వీటిలో 65 పబ్లిక్‌ ఇష్యూల వాటా 17.7 బిలియన్‌ డాలర్లు. ఇది కూడా రికార్డే! ఐపీవోలలో స్టార్టప్‌లు, ఈకామర్స్, ఐటీ కంపెనీల హవా కనిపించింది. ఏకంగా 33 యూనికార్న్‌లు ఊపిరిపోసుకున్నాయి. ఇక భారీ డీల్స్‌లోనూ 2021 రికార్డులు సాధించింది. బిలియన్‌ డాలర్ల విలువలో 14 డీల్స్‌ జరిగాయి. 99.9–50 కోట్ల డాలర్ల మధ్య మరో 15 లావాదేవీలు నమోదయ్యాయి. ఈ బాటలో 49.9–10 కోట్ల డాలర్ల పరిధిలోనూ 135 డీల్స్‌కు గతేడాది తెరతీసింది. డీల్స్‌ సంఖ్యలో ఇవి 8 శాతమే అయినప్పటికీ విలువలో 80 శాతంకావడం గమనార్హం!   

భారీ డీల్స్‌
గతేడాది జరిగిన లావాదేవీలలో 76 శాతం దేశీయంగా నమోదయ్యాయి. మిగిలినవి విదేశీ డీల్స్‌. ఇదేవిధంగా 1,624 డీల్స్‌ ద్వారా 48.2 బిలియన్‌ డాలర్లతో పీఈ పెట్టుబడులు కొత్త రికార్డులు నెలకొల్పాయి. వీటిలో 10 కోట్ల డాలర్లకు మించినవి 112 కాగా.. 66 శాతం నిధులు స్టార్టప్‌లలోకి ప్రవేశించడం ప్రస్తావించదగ్గ అంశం! వీటిలోనూ మళ్లీ 32 శాతం ఈకామర్స్‌ సంస్థలలోకి మళ్లాయి. రిటైల్, కన్జూమర్, ఎడ్యుకేషన్, ఫార్మా రంగ సంస్థలు పెట్టుబడులను బాగా ఆకట్టుకున్నాయి. పీఈ లావాదేవీల్లో 10 శాతాన్ని ఆక్రమించాయి. మరోపక్క 36 కంపెనీలు 2021లో క్విప్‌ల ద్వారా 6.2 బిలియన్‌ డాలర్లు సమీకరించాయి. వెరసి 2011 తదుపరి క్విప్‌ మార్గంలో అత్యధిక నిధుల సమీకరణ నమోదైంది. దివాలా చర్యలకు లోనైన దివాన్‌ హౌసింగ్‌(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌)ను 5.1 బిలియన్‌ డాలర్లకు పిరమల్‌  కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 

చదవండి:స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీ.. 4 రోజుల్లో రూ.9.30 లక్షల కోట్ల సంపద

Videos

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)