amp pages | Sakshi

అక్రమ వాణిజ్యం, ప్రభుత్వానికి రూ.58,521 కోట్ల నష్టం!

Published on Sat, 09/24/2022 - 07:53

న్యూఢిల్లీ: అక్రమ వాణిజ్యం కారణంగా పెద్ద ఎత్తున పన్ను ఆదాయానికి నష్టం వాటిల్లుతోంది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో అక్రమ వాణిజ్యం కారణంగా రూ.58,521 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయినట్టు వాణిజ్య మండలి ఫిక్కీ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. ఎఫ్‌ఎంసీజీ, మొబైల్‌ ఫోన్లు, పొగాకు ఉత్పత్తులు, మద్యం రంగాల్లో అక్రమ వాణిజ్యాన్ని ప్రస్తావించింది. ఈ రంగాల్లో అక్రమ వాణిజ్యం 2019–20లో రూ.2.60 లక్షల కోట్లుగా ఉంటుందని ఫిక్కీ అంచనా వేసింది. ఇందులో ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల టర్నోవర్‌ 75 శాతంగా ఉంటుందని తెలిపింది.

అక్రమ వాణిజ్యం కారణంగా ఎఫ్‌ఎంసీజీ ప్యాకేజ్డ్‌ పరిశ్రమలో రూ.17,074 కోట్లు, ఆల్కహాల్‌ ఉత్పత్తుల వల్ల రూ.15,262 కోట్లు, పొగాకు ఉత్పత్తుల వల్ల రూ.13,331 కోట్లు, ఎఫ్‌ఎంసీజీ హౌస్‌హోల్డ్, పర్సనల్‌ గూడ్స్‌ విభాగంలో రూ.9,995 కోట్లు, మొబైల్‌ ఫోన్లలో రూ.2,859 కోట్ల మేర పన్ను నష్టం వాటిల్లినట్టు వెల్లడించింది. ‘అక్రమ మార్కెట్లు.. జాతి ప్రయోజనాలకు విరుద్ధం’ పేరుతో ఫిక్కీ ఈ నివేదికను తీసుకొచ్చింది. పొగాకు ఉత్పత్తులు, మద్యం ఉత్పత్తుల రూపంలో ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున పన్ను ఆదాయం వస్తుంటుంది. వీటిపై నియంత్రణలు కూడా ఎక్కువే కావడం గమనార్హం. అక్రమ వాణిజ్యం వల్ల ఖజానాకు కలిగిన నష్టంలో సగం పొగాకు, మద్యం ఉత్పత్తుల నుంచే ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది.  

ఉపాధికీ నష్టమే.. 
ఎఫ్‌ఎంసీజీ ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ పరిశ్రమలో అక్రమ వాణిజ్యం కారణంగా 7.94 లక్షల మంది ఉపాధికి నష్టం వాటిల్లింది. పొగాకు పరిశ్రమలో 3.7 లక్షల మంది, ఎఫ్‌ఎంసీజీ హౌస్‌హోల్డ్, పర్సనల్‌ గూడ్స్‌ పరిశ్రమలో 2.98 లక్షల మంది, ఆల్కహాల్‌ బెవరేజెస్‌లో 97,000 మంది, మొబైల్‌ ఫోన్‌ పరిశ్రమలో 35,000 మంది అక్రమ వాణిజ్యం కారణంగా ఉపాధి కోల్పోయారు. ‘‘ఈ రంగాల్లో అక్రమ వాణిజ్యం వల్ల  ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావమే చూపిస్తుంది. ఎందుకంటే ఇతర రంగాలతో ఈ రంగాలకు అనుబంధం ఉండడం వల్లే’’అని ఫిక్కీ నివేదిక వివరించింది. తయారీని బలోపేతం చేయడం, అసలైన ఉత్పత్తులకు సంబంధించి డిమాండ్‌–సరఫరా మధ్య అంతరం లేకుండా చూడడం, వినియోగదారుల్లో అవగాహన కల్పించడం, పన్ను టారిఫ్‌ల క్రమబద్ధీకరణ, ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం.. అక్రమ వాణిజ్య నిరోధానికి అవసరమని ఫిక్కీ నివేదిక సూచించింది.

చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్‌ భారీ షాక్‌.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా!

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)