amp pages | Sakshi

పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్‌ వసూళ్లు 48 శాతం అప్‌

Published on Mon, 09/06/2021 - 06:39

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 48 శాతం ఎగిసింది. ఏప్రిల్‌–జులై మధ్య కాలంలో ఎక్సైజ్‌ డ్యూటీ రూపంలో రూ. 1 లక్ష కోట్లు పైగా వసూలయ్యాయి. గత ఆరి్థక సంవత్సరం ఇదే వ్యవధిలో వసూలైనది రూ. 67,895 కోట్లు. తొలి నాలుగు నెలల్లో అదనంగా వచి్చన రూ. 32,492 కోట్లు .. పూర్తి ఆరి్థక సంవత్సరంలో చమురు బాండ్లకు ప్రభుత్వం కట్టాల్సిన రూ. 10,000 కోట్ల కన్నా మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. సింహ భాగం వసూళ్లు పెట్రోల్, డీజిల్‌పై సుంకాల ద్వారానే నమోదయ్యాయి.

ఎకానమీ కోలుకునే కొద్దీ అమ్మకాలు మరింత పెరిగితే గత ఆరి్థక సంవత్సరంతో పోలిస్తే ఈసారి వసూళ్లు అదనంగా రూ. 1 లక్ష కోట్ల పైగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సబ్సిడీ ధరపై వంటగ్యాస్, కిరోసిన్, డీజిల్‌ మొదలైనవి విక్రయించడం వల్ల ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు వచి్చన నష్టాలను భర్తీ చేసేందుకు గత యూపీఏ ప్రభుత్వం వాటికి రూ. 1.34 లక్షల కోట్ల విలువ చేసే బాండ్లను జారీ చేసింది. ఆరి్థక శాఖ వర్గాల ప్రకారం వీటికి సంబంధించి ఈ ఆరి్థక సంవత్సరం రూ. 10,000 కోట్లు కట్టాల్సి ఉంది. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) విధానం అమల్లోకి వచ్చాక పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం, సహజ వాయువుపై మాత్రమే ఎక్సైజ్‌ సుంకం విధిస్తున్న సంగతి తెలిసిందే.   

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)