తీపి కబురు: దిగొచ్చిన బంగారం ధరలు!

Published on Fri, 02/12/2021 - 16:18

న్యూఢిల్లీ: బంగారం కొనుగోలు చేసేవారికి తీపికబురు. పసిడి రేటు భారీగా దిగొచ్చింది. ఫిబ్రవరి 6 నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు మళ్లీ నిన్నటి(ఫిబ్రవరి 11) నుంచి తగ్గుముఖం పట్టాయి. కేవలం రెండు రోజుల్లోనే రూ.500కు పైగా తగ్గింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు దిగిరావడంతో దేశీ మార్కెట్‌లోనూ రేట్లు తగ్గాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

హైదరాబాద్ మార్కెట్‌లో రెండు రోజుల్లోనే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.500పైగా క్షీణించింది. దీంతో నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రేటు రూ.48,290కు దిగొచ్చింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.500 పైగా క్షిణించి రూ.44,250కు పడిపోయింది. బంగారం ధర పడిపోతే.. వెండి రేటు మాత్రం స్వల్పంగా పెరిగింది. కేజీ వెండి ధర రూ.600 పెరిగి రూ.72,900కు చేరుకుంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

చదవండి:

ఆర్బీఐ లోపాలే.. లోన్‌ యాప్‌లకు లాభాలు!

వారాంతంలో ఫ్లాట్‌గా

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ