amp pages | Sakshi

జీడీపీ యూటర్న్‌!

Published on Sat, 02/27/2021 - 06:02

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థ కోలుకుంది. కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో రెండు త్రైమాసికాల వరుస క్షీణ రేటుతో ‘సాంకేతికంగా’  మాంద్యంలోకి జారిపోయిన భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మెజారిటీ విశ్లేషణలకు అనుగుణంగానే అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో వృద్ధి బాట పట్టింది. ఆర్థి క సంవత్సరం మూడవ త్రైమాసికంలో 0.4 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంది. తాజా సవరిత గణాంకాల ప్రకారం మొదటి త్రైమాసికం ఏప్రిల్‌–జూన్‌ మధ్య జీడీపీ భారీగా 24.4 శాతం క్షీణత నమోదు చేసింది.

రెండవ త్రైమాసికం జూలై–సెప్టెంబర్‌లో క్షీణత 7.3 శాతానికి పరిమితమైంది (నవంబర్‌ 20నాటి తొలి అంచనాల ప్రకారం ఈ క్షీణ రేట్లు వరుసగా 23.9 శాతం, 7.5 శాతంగా ఉన్నాయి). రెండు త్రైమాసికాలు వరుస క్షీణతను మాంద్యంగా పరిగణిస్తారు. మూడవ త్రైమాసికంలో వృద్ధి నమోదుకావడంతో భారత్‌ ఎకానమీ మాంద్యం కోరల నుంచి బయటపడినట్లయ్యింది. ప్రధానంగా వ్యవసాయం, సేవలు, నిర్మాణ రంగాలు  ఇందుకు దోహదం చేశాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో భారత్‌ జీడీపీ వృద్ధి రేటు 3.3 శాతం.   జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) శుక్రవారం విడుదల చేసిన తాజా గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే...

► మొత్తం జీడీపీలో దాదాపు 15 శాతం వాటా ఉన్న  వ్యవసాయ రంగం వృద్ధి రేటు డిసెంబర్‌ త్రైమాసికంలో 3.9 శాతంగా ఉంది.  
► తయారీ రంగం స్వల్పంగా 1.6 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది.
► నిర్మాణ రంగం భారీగా 6.2% వృద్ధి చెందింది.  
► విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవల విభాగంలో భారీగా 7.3 శాతం వృద్ధి నమోదయ్యింది.  
► మూలధన పట్టుబడులకు సంబంధించిన ఫిక్స్‌డ్‌ క్యాపిటల్‌ ఫార్మేషన్‌ విభాగంలో 2.6 శాతం వృద్ధి నమోదయ్యింది.
► వాణిజ్య, హోటెల్‌ పరిశ్రమ కరోనా మహమ్మారి సవాళ్ల నుంచి బయటకు రాలేదు. మూడవ త్రైమాసికంలోనూ క్షీణత 7.7%గా నమోదైంది.  
► ప్రభుత్వ వినియోగ వ్యయాలు 1.1%క్షీణిస్తే, ప్రైవేటు వినియోగ వ్యయం 2.4% తగ్గింది.  


0.4 శాతం ఎలా అంటే...
మూడవ త్రైమాసికంలో మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువ రూ.36.22 లక్షల కోట్లు. 2019–20 ఇదే కాలంలో ఈ విలువ రూ.36.08 లక్షల కోట్లు. వెరసి తాజా సమీక్షా త్రైమాసికంలో వృద్ధి 0.4 శాతంగా ఉన్నట్లు లెక్క.  

2020–21లో క్షీణత అంచనా 8 శాతం !
నేషనల్‌ అకౌంట్స్‌ రెండవ ముందస్తు అంచనాల ప్రకారం, 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ ఎకానమీ క్షీణ రేటు 8 శాతంగా ఉంటుందని ఎన్‌ఎస్‌ఓ పేర్కొంది. తొలి అంచనాల ప్రకారం ఈ రేటు 7.7 శాతంగా ఉండడం గమనార్హం. 2019–20లో 4 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. తాజా అంచనాల ప్రకారం 2019–20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ విలువ 145.69 లక్షల కోట్లు. అయితే 2020–21లో ఈ విలువ 134.09 లక్షల కోట్లకు పడిపోయే వీలుంది. అంటే క్షీణత 8 శాతం ఉంటుందన్నమాట. కాగా,  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) ఎకానమీ 7.5 శాతం క్షీణతను నమోదుచేసుకుంటుందని అంచనావేసిన ఆర్‌బీఐ,  మూడవ త్రైమాసికంలో 0.1%, నాల్గవ త్రైమాసికంలో 0.7% వృద్ధి రేట్లు నమోదవుతాయని సమీక్షలో విశ్లేషించింది.
 

తలసరి ఆదాయం 9.1% డౌన్‌!
తాజా గణాంకాల ప్రకారం 2011–12 ధరలను ప్రాతిపదికగా (ద్రవ్యోల్బణం సర్దుబాటుతో) తీసుకుంటే, 2020–21లో తలసరి ఆదాయం రూ.85,929 ఉంటుందని అంచనా. 2019–20లో ఈ విలువ రూ.94,566. అంటే తలసరి ఆదాయంలో 9.1 శాతం క్షీణత నమోదయ్యే అవకాశం ఉంది. కాగా ప్రస్తుత ధరల ప్రాతిపదిగా చూస్తే, తలసరి ఆదాయం 4.8 శాతం క్షీణతతో రూ.1,34,186 నుంచి రూ.1,27,768కి పడిపోతుంది. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)