amp pages | Sakshi

మీరు ఇల్లు కొంటున్నారా? ఇవీ తెలుసుకోకపోతే భారీ నష్టం!

Published on Fri, 05/26/2023 - 18:45

స్థిరాస్థులైన ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, వ్యవసాయ క్షేత్రాల్ని కొనుగోలు చేస్తుంటాం. ఆ కొనుగోళ్ల సమయంలో తక్కువ రేటు, మంచి ప్రాంతం, అన్నీ వసతులు ఉన్నాయా? లేవా?.. ఇప్పుడు పెట్టిన పెట్టుబడులు భవిష్యత్‌లో ఎంత పెరుగుతాయి’ అనే తదితర విషయాల గురించి ఆరా తీస్తుంటాం. అన్నీ బాగుంటే మన బడ్జెట్‌కు తగ్గట్లు సొంతం చేసుకుంటాం. అదే సమయంలో మీరో విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. లేదంటే భారీగా నష్టపోతారని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు.

స్థిరాస్థులపై ప్రభుత్వ పథకాలైన ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై), బ్యాంకులు ప్రత్యేక ఆఫర్లు అందిస్తుంటాయి. ముఖ్యంగా ఏదైనా ప్రాపర్టీని తల్లి లేదా భార్య, కుమార్తె పేరు మీద కొనుగోలు చేస్తే ట్యాక్స్‌ బెన్ఫిట్స్‌, స్టాంప్‌ డ్యూటీ, డిస్కౌంట్‌కే వడ్డీ రేట్లను పొందవచ్చు. 

ఒకవేళ ప్రాపర్టీని కొనుగోలు చేస్తే భార్య, కుమార్తె పేరుమీద కొనుగోలు చేయాలని ఆర్ధిక నిపుణులు సలహా ఇస్తున్నారు. ఆయా రాష్ట్రాల వారీగా ప్రాపర్టీ కొనుగోళ్లతో స్టాంప్‌ డ్యూటీ ఉంటుంది. ఉదాహరణకు హర్యానాలో స్థిరాస్థులు మహిళలపై కొంటే స్టాంప్‌ డ్యూటీ 2శాతం చెల్లించాలి. అదే పురుషుడి పేరుమీద ఉంటే 7 శాతం కట్టాలి. మిగిలిన రాష్ట్రాల్లో 5శాతం చెల్లించాలి. ఇద్దరి (భార్య - భర్త) పొత్తులో ఓ ప్రాపర్టీపై పెట్టుబడులు పెడితే.. స్టాంప్‌ డ్యూటీ 1శాతం తగ్గుతుంది. 

 


లక్షల్లో ఆదా
ఢిల్లీలో రూ.50 లక్షల విలువైన ఆస్తిని కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ ఆస్తిని మీ పేరు మీద రిజిస్టర్ చేసుకుంటే ఏడు శాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, మీ భార్య లేదా తల్లి పేరు మీద ఆస్తిని రిజిస్టర్ చేస్తే ఐదు శాతం రిజిస్ట్రేషన్‌ ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా,  లక్షల్లో రిజిస్ట్రేషన్ ఖర్చుల్ని ఆదా చేసుకోవచ్చు. అదే ఆస్తిని భార్య పేరు మీద మాత్రమే కాకుండా భర్త పేరుమీద జాయింట్‌గా కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌లో ఒక శాతం రాయితీ పొందవచ్చు. దీనివల్ల రూ.50,000 ఆదా అవుతుంది.  

త్వరగా బ్యాంక్‌ లోన్లు
అంతేకాదు మహిళల పేరుమీద ఆస్తిని కొనుగోలు చేస్తే ఇంటి రుణాలు త్వరగా వస్తాయి. బ్యాంకులు సాధారణంగా గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకునే మహిళలకు ప్రత్యేక డిస్కౌంట్లు, ప్రోత్సాహకాలు అందిస్తాయి. పనిచేసే మహిళ లేదా మహిళా వ్యాపారవేత్తలు గృహ రుణం కోసం దరఖాస్తు చేస్తే, ఆమె ఆదాయాన్ని తన భర్త ఆదాయంతో కలిపి రుణాన్ని ఎక్కువగా ఇస్తారు. కలపవచ్చు, ఫలితంగా అధిక రుణ మొత్తం వస్తుంది.

చివరిగా : కాబట్టి స్థిరాస్థుల కొనుగోలు చేసే సమయాల్లో సంబంధిత నిపుణులు సలహాలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఇందుకోసం జాతీయ, అంతర్జాతీయ సంస్థల నిపుణులు సలహాలు ఇస్తుంటారు. అందుకు ప్రతిఫలంగా కొద్ది మొత్తంలో ఫీజు రూపంలో చెల్లించాలి.

చదవండి👉 హైదరాబాద్‌లో ఆ ఏరియా ఇళ్లే కావాలి.. కొనుక్కునేందుకు ఎగ‌బ‌డుతున్న జ‌నం?

Videos

ఏపీ ఎన్నికలపై సీఈఓ ముకేశ్ కుమార్ కీలక ప్రెస్ మీట్

టీడీపీ నాయకుల దాష్టీకం..

జగన్నాథుడి జైత్రయాత్ర తథ్యం..కూటమి కుట్రలు పారలేదు

కేతిరెడ్డి పెద్ద రెడ్డి ఇంట్లో పోలీసుల వీరంగం

వైఎస్సార్సీపీ గెలుపుతో చంద్రబాబు రథచక్రాలు విరిగిపోతాయి...

గవర్నమెంట్ పాజిటివ్ వోట్ ముఖ్యంగా మహిళలు..గ్రాఫ్ చూస్తే..!

ఏపీలో రికార్డ్ స్థాయిలో పోలింగ్‌..

ప్లీజ్ నన్ను ట్రోల్ చేయండి..

మళ్లీ కలకలం రేపుతున్న సుచిత్ర లీక్స్..

ప్రేమలు హీరోయిన్ తో ప్రేమలో పడనున్న రౌడీ..

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)