amp pages | Sakshi

రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లకు భారీ షాక్‌!

Published on Sat, 04/16/2022 - 21:54

సాక్షి, హైదరాబాద్‌: అధిక రుణాలు, నిధుల లేమిలతో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న దేశీయ డెవలపర్లకు నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల మరొక గుదిబండలాగా మారింది. నిర్మాణ వ్యయంలో అధిక వాటా ఉండే సిమెంట్, స్టీల్‌ ధరలు గత ఏడాది కాలంలో 20 శాతం మేర పెరిగాయి. దీంతో నిర్మాణ వ్యయం 10–12 శాతం పెరిగిందని కొల్లియర్స్‌ రీసెర్చ్‌ తెలిపింది.

 టోకు ధరల ద్రవ్యోల్బణం, మెటీరియల్‌ ధరలు రెండంకెల పెరుగుదలను నమోదు చేస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి నిర్మాణ వ్యయం అదనంగా 8–9 శాతం మేర పెరగొచ్చని అంచనా వేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో రవాణా పరిమితులు, ఇంధన వనరుల ధరలు పెరుగుదల కారణంగా ఇన్‌పుట్‌ కాస్ట్‌ పెరిగాయని కొల్లియర్స్‌ ఇండియా ఎండీ అండ్‌ సీఈఓ రమేష్‌ నాయర్‌ తెలిపారు. 

2021 మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో స్టీల్‌ ధరలు 30 శాతం, సిమెంట్‌ 22 శాతం, కాపర్‌ 40 శాతం, అల్యూమీనియం 44 శాతం, ఇంధన వనరుల ధరలు 70 శాతం మేర పెరిగాయని వివరించారు. దీంతో గతేడాది మార్చిలో నివాస సముదాయాల నిర్మాణ వ్యయం చ.అ.కు రూ.2,060గా ఉండగా.. ఈ ఏడాది మార్చి నాటికి రూ.2,300లకు, అలాగే ఇండస్ట్రియల్‌ నిర్మాణ వ్యయం గతేడాది రూ.1,900ల నుంచి ఈ ఏడాది మార్చి నాటికి రూ.2,100లకు పెరిగిందని వివరించారు. ఇప్పటికే తక్కువ మార్జిన్లతో నిర్మాణ పనులను చేపడుతున్న అందుబాటు, మధ్య స్థాయి గృహ నిర్మాణ డెవలపర్లకు తాజాగా పెరిగిన నిర్మాణ వ్యయం మరింత ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పారు. వ్యయ భారం నుంచి కాసింత ఉపశమనం పొందేందుకు డెవలపర్లు ప్రాపర్టీ ధరలను పెంచక తప్పని పరిస్థితని పేర్కొన్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)