amp pages | Sakshi

APPLE: యాపిల్‌ మెగా ఈవెంట్‌.. 13 సిరీస్‌పై ఉత్కంఠ

Published on Tue, 09/14/2021 - 12:45

iPhone 13 Launch Event:  ప్రతీ ఏడాదిలాగే ఈ సెప్టెంబర్‌లోనూ మెగా ఈవెంట్‌కు  యాపిల్‌  సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి(సెప్టెంబర్‌ 14) 10గం.30 ని. ‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్‌’ ఈవెంట్‌ ద్వారా యాపిల్‌ కొత్త ప్రొడక్టులను లాంఛ్‌ చేయనుంది.  కరోనా వల్ల వర్చువల్‌గా ఈవెంట్‌ నిర్వహిస్తుండడం యాపిల్‌కు ఇది రెండోసారి. 

ఇక వారం నుంచి ఈ మెగా ఈవెంట్‌ కోసం ఐఫోన్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో లీకేజీల పేరిట పలు ఫీచర్లు తెరపైకి వస్తున్నాయి.  ఐఫోన్‌ 13 సిరీస్‌లో ఐఫోన్‌ 13, మినీ,  ప్రో, ప్రో మ్యాక్స్‌ మొత్తం నాలుగు మోడల్స్‌ ఒకేసారి రిలీజ్‌ చేయడం ద్వారా సంచలనానికి యాపిల్‌ తెర తీయబోతోందనే ప్రచారం నడుస్తోంది. ఐఫోన్‌ 13, మినీ  మోడల్స్‌లో లార్జ్‌ కెమెరా సెన్సార్‌లు ఉండొచ్చని, ప్రొ-ప్రొమ్యాక్స్‌లో  అల్ట్రా వైడర్‌ కెమెరాలు ఉండొచ్చని భావిస్తున్నారు.  ఇక ఇదే ఈవెంట్‌లో యాపిల్‌ స్మార్ట్‌వాచ్‌ 7 సిరీస్‌,  థర్డ్‌ జనరేషన్‌ ఎయిర్‌పాడ్స్‌(Airpods 3) కూడా రిలీజ్‌ చేయొచ్చని భావిస్తున్నారు.  కాలిఫోర్నియా సిలికాన్‌ వ్యాలీలోని క్యూపర్టినో యాపిల్‌ హెడ్‌క్వార్టర్స్‌ నుంచి ఈ ఈవెంట్‌ టెలికాస్ట్‌ కానుంది. యాపిల్‌ యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా కూడా లైవ్‌ వీక్షించొచ్చు.  ఇక యాపిల్‌ టీవీ యూజర్స్‌.. యాప్‌ ద్వారా కీనోట్‌ను చూడొచ్చు. 

సిమ్‌ లేకుండానే..
ఐఫోన్‌ 13కి సంబంధించి ఇప్పటికే అనేక రూమర్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. సిమ్‌ కార్డ్‌ అవసరం లేకుండా లియో టెక్నాలజీ ఆధారంగా ఈ ఫోన్‌ పని చేస్తుందని,  ఎమర్జెన్సీ మెసేజ్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉంటుందని ఇలా రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. అలాగే ఫోన్‌ వెయిట్‌, మందం కిందటి ఏడాది మోడల్స్‌ కంటే ఎక్కువగా ఉండొచ్చని చెప్తున్నారు.

ప్రతీకాత్మక చిత్రం  

టూమచ్‌ ప్రచారం..
అయితే 13 అనేది ఫారిన్‌ దేశాల్లో అచ్చీరాని నెంబర్‌. ఈ మూఢనమ్మకంతో 13 సిరీస్‌ను తప్పించి..  14 సిరీస్‌ను యాపిల్‌ రిలీజ్‌ చేస్తుందేమో అనే ఊహాగానాలు సైతం చక్కర్లు కొడుతున్నాయి. అందుకే సెప్టెంబర్‌ 13వ తేదీన కాకుండా.. 14వ తేదీన లాంఛ్‌కు ముహూర్తం పెట్టిందనే టాక్‌ కూడా సోషల్‌ మీడియాలో నడిచింది. కానీ, ఇలాంటి నమ్మకాల్ని పట్టించుకోకుండా యాపిల్‌ 13 సిరీస్‌ ద్వారానే రాబోతోందని తెలుస్తోంది. 

క్లిక్‌ చేయండి:  ఐఫోన్‌ 12 సిరీస్‌ ఫోన్లపై భారీ తగ్గింపు!


ధర అటుఇటుగా..
మార్కెట్‌ వర్గాల అంచనా ప్రకారం అమెరికాలో ఐఫోన్‌ 13 సిరీస్‌ కనిష్ట ధర 799 డాలర్లుగా ఉంది. అయితే భారత మార్కెట్‌కి వచ్చే సరికి స్థానిక ట్యాక్సుల ఆధారంగా ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

వెర్షన్‌                               అమెరికా (భారత్‌)
ఐఫోన్‌ 13                       799 డాలర్లు (రూ. 58,600)
ఐఫోన్‌ 13 మినీ               699 డాలర్లు (రూ. 51,314)

పై రెండు 64జీబీ, 128 జీబీ స్టోరేజ్‌ ఆప్షన్స్‌తో రావొచ్చు!. బ్లాక్‌, బ్లూ, పింక్‌, పర్పుల్‌, రెడ్‌, వైట్‌ కలర్స్‌లో ఫోన్లు రిలీజ్‌ అయ్యే చాన్స్‌ ఉంది.

ప్రతీకాత్మక చిత్రం 

ఐఫోన్‌ 13 ప్రో                 999 డాలర్లు (రూ.73,300)
ఐఫోన్‌ 13ప్రో మ్యాక్స్‌      1,099 డాలర్లు (రూ 80,679)

128జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టెరేజ్‌ వెర్షన్‌లలో రిలీజ్‌ కావొచ్చు. అయితే ఈ రెండు వెర్షన్‌లలో 1టీబీ స్టోరేజ్‌ మోడల్‌ అంటూ ఒక పుకారు సైతం చక్కర్లు కొడుతోంది.  బ్లాక్‌, బ్రౌన్‌, గోల్డ్‌, సిల్వర్‌ కలర్స్‌లో రిలీజ్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. అయితే పైన చెప్పుకున్న ఫీచర్లు, ధరలన్నీ అంచనాలు, ఊహాగానాలు మాత్రమే. యాపిల్‌ సంస్థ పైవాటిలో ఏ ఒక్కదానిని అధికారికంగా ధ్రువీకరించలేదు. కేవలం ఎక్స్‌పర్ట్స్‌, టెక్‌ వెబ్‌సైట్ల అంచనాలను బట్టే ఇస్తున్నాం.

చదవండి: యాపిల్‌ మార్కెట్‌ ఢమాల్‌! భారమంతా ఐఫోన్‌ 13 పైనే?

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)