amp pages | Sakshi

వారం రోజుల్లో సుమారు రెండున్నర లక్షల కోట్లు ఖతమ్‌..!

Published on Sun, 10/31/2021 - 13:49

గత కొద్దిరోజులుగా దేశీయ స్టాక్‌మార్కెట్స్‌ కొత్త రికార్డులను నమోదుచేసిన విషయం తెలిసిందే. రంకెలేస్తు వచ్చిన బుల్‌ను బేర్‌ ఒక దెబ్బతో పడగొట్టింది.  పలు కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, అంతర్జాతీయ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకలు, ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించే విషయంలో అమ్మకాల జోరు ఊపందుకోవడంతో స్టాక్‌మార్కెట్లు కొద్దిరోజుల నుంచి కుప్పకూలుతూ వచ్చాయి.

అక్టోబర్‌ 29 రోజున దేశీయ సూచీలు ఒక్కసారిగా పడిపోవడంతో ఇన్వెస్టర్ల రూ. 4.82 లక్షల కోట్ల సంపద ఆవిరి అయ్యింది. బేర్‌ కొట్టిన దెబ్బకు రిలయన్స్‌, హెడీఎఫ్‌సీ లాంటి టాప్‌ 10 అత్యంత విలువైన కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ భారీగా పడిపోయాయి. అత్యంత విలువైన కంపెనీలలో తొమ్మిది కంపెనీలు గత వారం  మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 2,48,542.3 కోట్లను కోల్పోయాయి.  బలహీనమైన విస్తృత మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా సంస్థలు తమ మార్కెట్ విలువను కోల్పోవడం జరిగింది. టాప్‌-10 మార్కెట్‌ క్యాప్‌ కంపెనీల జాబితాలో కేవలం ఐసీఐసీఐ బ్యాంక్‌ మాత్రమే లాభపడింది.    
చదవండి: నవంబర్‌ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్‌..! ఇవే..!

రిలయన్స్‌ మార్కెట్‌ క్యాప్‌ సుమారు రూ.56,741.2 కోట్లు తగ్గి రూ.16,09,686.75 కోట్లకు చేరుకుంది.

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 54,843.3 కోట్లు క్షీణించి రూ.8,76,528.42 కోట్ల వద్ద స్థిరపడింది.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) విలువ రూ.37,452.9 కోట్లు తగ్గి రూ.12,57,233.58 కోట్లకు చేరుకుంది. 

ఇన్ఫోసిస్ మార్కెట్‌ క్యాప్‌ విలువ రూ.27,678.78 కోట్లు తగ్గి రూ.7,01,731.59 కోట్ల వద్ద స్థిరపడింది. 

కోటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్‌ క్యాప్‌ విలువ రూ.27,545.09 కోట్లు తగ్గడంతో రూ.4,03,013 కోట్లకు చేరింది.

బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు  రూ. 18,774.8 కోట్లు తగ్గింది. దీంతో ఎమ్‌-క్యాప్‌ విలువ 4,46,801.66 కోట్లకు చేరుకుంది. 

హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్) రూ. 14,356 కోట్లు తగ్గి రూ. 5,62,480.40 కోట్ల వద్ద స్థిరపడింది.

హెచ్‌డిఎఫ్‌సి వాల్యుయేషన్ రూ.10,659.37 కోట్లు తగ్గి రూ.5,14,217.69 కోట్లకు చేరుకోగా.. ప్రభుత్వ బ్యాంకింగ్‌ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా కొంత మేర నష్టాలను చవిచూసింది.  గతవారంలో సుమారు రూ.490.86 కోట్లు తగ్గి రూ.4,48,372.48 కోట్లకు చేరింది.

టాప్‌-10 మార్కెట్‌ క్యాప్‌ కల్గిన కంపెనీలో కేవలం ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రమే రూ. 30,010.44 కోట్లను జోడించి రూ. 5,56,507.71 కోట్లకు తీసుకుంది.

చదవండి: గూగుల్‌పే మాదిరిగా...వాట్సాప్‌లో రూ. 255 వరకు క్యాష్‌బ్యాక్‌..!

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)