amp pages | Sakshi

ఈ రాశివారికి వారం ప్రారంభంలో అనుకోని  ధనవ్యయం

Published on Sun, 03/07/2021 - 06:34

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక లావాదేవీలు మరింత  ఆశాజనకంగా ఉంటాయి. గతంలో నిలిచిపోయిన పనులు కూడా సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. శుభకార్యాల గురించి కుటుంబంలో చర్చిస్తారు. విద్యార్థుల  ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. కుటుంబంలో సమస్యలు. ఎరుపు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహి ణి, మృగశిర 1,2 పా.)
కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు.  ఆప్తుల సలహాలతో ముందడుగు వేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు. కొంతకాలంగా నిరీక్షిస్తున్న అవకాశాలు కొన్ని దగ్గరకు రావచ్చు. ప్రముఖులతో పరిచయాలు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు సజావుగా లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ సమర్థతను గుర్తిస్తారు.  రాజకీయవర్గాలకు కొన్ని పదవులు దక్కవచ్చు.  వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ధనవ్యయం. తెలుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు. కుటుంబంలో నెలకొన్న సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితుల నుంచి ఊహించని సాయం అందుతుంది. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు. చిన్ననాటి  విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. కొన్ని వివాదాల పరిష్కారానికి చొరవ తీసుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో ఒడిదుడుకులు, ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు గతం కంటే మెరుగ్గా ఉంటుంది.  వారం మధ్యలో ఆరోగ్యభంగం. బంధువులతో తగాదాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహన, గృహయోగాలు కలిగే సూచనలు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగప్రాప్తి. ఒక దీర్ఘకాలిక సమస్య ఎట్టకేలకు పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. కళారంగం వారి ఆశలు కొన్ని ఫలిస్తాయి. . వారం చివరిలో కొత్త రుణయత్నాలు. అనారోగ్యం. తెలుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి..

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
సంఘంలో మీరంటే ప్రత్యేక గౌరవం ఏర్పడుతుంది. మిత్రులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. వ్యవహారాలలో  విజయం సాధిస్తారు.  నిరుద్యోగులు, విద్యార్థులు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలలో అవాంతరాలు అధిగమిస్తారు.  మరపురాని సంఘటన ఒకటి ఎదురవుతుంది. వ్యాపారాలలో భాగస్వాములు మీ సలహాలు పాటిస్తారు. ఉద్యోగాలలో ఎటువంటి బాధ్యతనైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. పారిశ్రామికవర్గాలకు కొత్త అనుమతులు లభించే వీలుంది.  వారం ప్రారంభంలో అనుకోని  ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అందుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు తొలగి  విజయం సాధిస్తారు. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థుల ప్రతిభకు సరైన గుర్తింపు లభిస్తుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. లాభాలు ఆశించినంతగా అందుతాయి. ఉద్యోగాలు  ప్రగతిదాయకంగా ఉంటాయి. కళారంగం వారి యత్నాలలో కదలికలు ఉంటాయి.  వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఊహించని కాంట్రాక్టులు దక్కవచ్చు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు అరుదైన అవకాశాలు. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. నీలం, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణాష్టకం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొన్ని పనులలో జాప్యం తప్పదు. ఆర్థిక విషయాలు కొంత నిరాశాజనకంగా ఉంటాయి. అప్పులు సైతం చేస్తారు. కుటుంబంలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో వివాదాలు నెలకొంటాయి. ఇంటి నిర్మాణయత్నాలు వాయిదా పడతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. కొన్ని సమస్యలు సవాలుగా మారవచ్చు.  వ్యాపారాలలో కొంత గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. రాజకీయవర్గాలకు పదవులు నిరాశ పరుస్తాయి.  వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. ఎరుపు, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని రుణాలు తీరి ఊరట చెందుతారు.  ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. నూతన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో మీరంటే ప్రత్యేక గౌరవం లభిస్తుంది. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు.  నిరుద్యోగులు ఊహించని అవకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారాలు లాభాల సాటిగా ఉంటాయి. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు అప్రయత్నంగా దక్కుతాయి. కళారంగం వారికి మరిన్ని అవకాశాలు దక్కవచ్చు. వారం చివరిలో  ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది. కొన్ని రుణాలు సైతం తీరే సమయం.  సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తుల వివాదాల నుంచి కొంత గట్టెక్కుతారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. కుటుంబసమస్యలు క్రమేపీ సర్దుకుంటాయి. వాహనాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి కొత్త పెట్టుబడులు సమీకరిస్తారు.  ఉద్యోగాలు  సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. పారిశ్రామికవర్గాలకు అంచనాలు నిజం కాగలవు. వారం ప్రారంభంలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. నేరేడు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఉద్యోగయత్నాలు సఫలమవుతాయి. ఇంటిలో శుభకార్యాల నిర్వహణపై చర్చలు సాగిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మనస్సులోని భావాలను తెలియజేస్తారు. రావలసిన  బాకీలు వసూలవుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. లాభాలు ఊరటనిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు లక్ష్యాలు నెరవేరతాయి. వారం మధ్యలో బంధువులతో తగాదాలు. అనారోగ్య సూచనలు. నీలం, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి›స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. సమాజసేవలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. లాభాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు సంతోషం కలిగిస్తాయి. కళారంగాల వారికి అవకాశాలు కొన్ని అప్రయత్నంగా దక్కవచ్చు.  వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. కుటుంబంలో చికాకులు. తెలుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కాలభైరవాష్టకం పఠించండి.

Videos

లండన్ కు చేరుకున్న సీఎం జగన్

వ్యాక్సిన్ తో ముప్పు?.. ఏది నిజం?

తెలంగాణలో రైతుల్ని నిండా ముంచిన అకాల వర్షం

థియేటర్ కు వచ్చిన వారం రోజుల్లోనే..ఓటీటీలోకి కృష్ణమ్మ మూవీ..

ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..

RCB vs CSK: ప్లే ఆఫ్స్‌ బెర్తుకై చావో రేవో

లక్నో విజయం.. ఓటమితో ముగించిన ముంబై!అట్టడుగున

బుట్టబొమ్మకి బంపర్ ఆఫర్..

ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతు

చిన్నస్వామిలో కురిసేది సిక్సర్ల వర్షమే.. CSKకి ఇక కష్టమే..

Photos

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)