సూర్యగ్రహణం భారత్‌లో కనిపించనుందా?

Published on Thu, 04/28/2022 - 12:29

ఏప్రిల్‌ 30వ తేదీ సూర్య గ్రహణం ఏర్పడనుంది.  ఈ ఏడాది ఇదే తొలి సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం వచ్చే రోజు అమవాస్యతో పాటు శనివారం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. హిందూ శాస్త్రాల ప్రకారం గ్రహణాలను అశుభంగా పరిగణిస్తారు. 

వైశాఖ మాసం కృష్ణ పక్షపు అమావాస్య రోజు నాడు సూర్యగ్రహణం ఏర్పడటం అరుదుగా సంభవిస్తుంటుందని పండితులు చెబుతున్నారు. దీని ప్రభావం కొన్ని రాశులపై ఉంటుందని సూచిస్తోన్నారు. సూర్యగ్రహణం, అమావాస్య, శనివారానికి చాలా ప్రాధాన్యత ఉంది. కొన్ని చోట్ల అమావాస్య రోజున పాలు కూడా కొనరు. శనివారం నాడు వంటనూనెకు సంబంధించిన వస్తువులు తీసుకోరు. ఇప్పుడు శనివారం, అమవాస్యకు తోడు సూర్యగ్రహణం రాబోతుంది. 

భారత్‌లో సూర్యగ్రహణం కనిపించదు?
భారత్‌లో ఈ సూర్యగ్రహణం కనిపించదు. అమెరికా దక్షిణ ప్రాంతం, అంటార్కిటికా, దక్షిణ పసిఫిక్ సముద్ర తీర ప్రాంత దేశాల ప్రజలు మాత్రమే ఈ పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించగలరు. చిలీ, అర్జెంటీనా, ఉరుగ్వే, పరాగ్వే పశ్చిమ ప్రాంతం, బొలీవియ నైరుతి ప్రాంతం, పెరూ ఈశాన్య ప్రాంతం, బ్రెజిల్ ఆగ్రేయ ప్రాంత ప్రజలు మాత్రమే దీన్ని చూడగలరని నాసా తెలిపింది. 

భారత్‌లో ఈ సూర్య గ్రహణం అర్ధరాత్రి ఆరంభమౌతుంది. సుమారు నాలుగు గంటల పాటు కొనసాగుతుంది. తెల్లవారు జామున 4:07 నిమిషాలకు ముగుస్తుంది. అంటే భారత్‌లో ప్రజలు దీన్ని వీక్షించే అవకాశం లేదు. ఫలితంగా భారత్‌లో సూర్యగ్రహణ ప్రభావం దాదాపు ఉండదు. 

గ్రహణాలు ఏర్పడేటప్పుడు కొన్ని రాశులపై వాటి ప్రభావం ఉంటుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణమే అయినప్పటికీ కొన్ని రాశులపై ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈ సూర్య గ్రహణం ప్రభావం మేష రాశిపై అధికంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం రవి మేష రాశిలో ఉండటం ఏప్రిల్‌ 30వ తేదీన చంద్రుడు మేషంలోకి రావడంతో ఈ రాశి వారిపై గ్రహణం ప్రభావం ఉండే అవకాశం ఉంది.

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)